e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News నూత‌న లిఫ్ట్‌ల డీపీఆర్‌లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలి : మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

నూత‌న లిఫ్ట్‌ల డీపీఆర్‌లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలి : మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

నూత‌న లిఫ్ట్‌ల డీపీఆర్‌లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలి : మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

హైద‌రాబాద్ : ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లాలో కొత్త‌గా నిర్మించ త‌ల‌పెట్టిన లిఫ్ట్‌ల డీపీఆర్‌లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాల‌ని మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ప్రాజెక్టుల పురోగ‌తిపై న‌గ‌రంలోని జ‌ల‌సౌధ‌లో మంత్రి శుక్ర‌వారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఎమ్మెల్యేలు గాద‌రి కిశోర్‌, చిరుమ‌ర్తి లింగ‌య్య‌, ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీపీఆర్‌లు పూర్తి చేసి స‌త్వ‌ర‌మే నిర్మాణాలు చేప‌ట్టాల‌న్నారు.

సూర్యాపేట జిల్లా ఎస్సారెస్పీ కాలువ‌ల ఆధునీక‌ర‌ణ‌తో పాటు అయిటిపాముల లిఫ్ట్ పనులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌న్నారు. నిర్దేశిత ల‌క్ష్యాల‌ను అధిగ‌మించేందుకు అధికారులు ప‌నుల వేగాన్ని పెంచాల‌న్నారు. జూన్ చివ‌రి వ‌ర‌కు బ‌స్వాపూర్ రిజ‌ర్వాయ‌ర్ పూర్తి చేయాల‌న్నారు. జులై చివ‌రి నాటికి బ‌స్వాపూర్‌కు కాళేశ్వ‌రం నీరు అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నూత‌న లిఫ్ట్‌ల డీపీఆర్‌లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలి : మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

ట్రెండింగ్‌

Advertisement