e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News గురువారం నుండి సంపూర్ణ లాక్‌డౌన్ పాటించ‌నున్న దండేప‌ల్లి

గురువారం నుండి సంపూర్ణ లాక్‌డౌన్ పాటించ‌నున్న దండేప‌ల్లి

గురువారం నుండి సంపూర్ణ లాక్‌డౌన్ పాటించ‌నున్న దండేప‌ల్లి

న‌ల్ల‌గొండ : క‌రోనా వైర‌స్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా న‌ల్ల‌గొండ జిల్లాలోని దండేప‌ల్లి గ్రామం రానున్న ప‌ది రోజులు పూర్తి లాక్‌డౌన్ పాటించాల‌ని బుధ‌వారం నిర్ణ‌యించింది. జూన్ 10 నుండి 20వ తేదీ వ‌ర‌కు గ్రామంలో 10 రోజుల‌పాటు పూర్తి లాక్‌డౌన్‌ను అమ‌లు చేసేందుకు గ్రామ పంచాయ‌తీ నిర్ణ‌యం తీసుకుంది. జిల్లా కేంద్రానికి 8 కిలోమీట‌ర్ల దూరంలో ఉండే ఈ గ్రామ జ‌నాభా 1,800.

గ్రామ స‌ర్పంచ్ పుష్పా సైదులు మాట్లాడుతూ.. గ్రామ వాసుల నిత్యావ‌స‌రాల నిమిత్తం గ్రామంలోని దుకాణాలు ఉద‌యం 6 నుండి 9 గంట‌ల మ‌ధ్య మాత్ర‌మే తెరుచుకుంటాయ‌న్నారు. రాబోయే 10 రోజులు గ్రామంలో ఎటువంటి ఫంక్ష‌న్లు, వివాహాల‌కు అనుమ‌తి ఉండ‌ద‌న్నారు. బెల్ట్ షాపులు బంద్ పాటిస్తాయ‌న్నారు. ఎవ‌రైనా గ్రామ పంచాయ‌తీ ఏక‌గ్రీవ నిర్ణ‌యాన్ని ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చ‌ర్య‌లు ఆమె అన్నారు. ఈ స‌మ‌యంలో ఇత‌ర ప్రాంతాల నుండి బంధువుల‌ను త‌మ ఇళ్ల‌కు ఆహ్వానించ‌వ‌ద్ద‌ని స‌ర్పంచ్ గ్రామ‌స్తుల‌ను కోరారు. కొవిడ్‌-19 పాజిటీవ్‌గా తేలిన ఇద్ద‌రు వ్య‌క్తులు గ్రామంలో ఇష్టానుసారం తిరుగుతుంటే న‌ల్ల‌గొండ రూర‌ల్ పోలీసులు వీరిని ఐసోలేష‌న్ కేంద్రానికి త‌ర‌లించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గురువారం నుండి సంపూర్ణ లాక్‌డౌన్ పాటించ‌నున్న దండేప‌ల్లి

ట్రెండింగ్‌

Advertisement