సోమవారం 28 సెప్టెంబర్ 2020
Nalgonda - Jun 13, 2020 , 17:53:07

విద్యుదాఘాతంతో ఆరు బర్రెలు మృతి

విద్యుదాఘాతంతో ఆరు బర్రెలు మృతి

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రం శివారులో విద్యుదాఘాతంతో శనివారం ఆరు బర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కొందరు ఉదయం బర్రెలను మోత కోసం విడిచిపెట్టారు. గ్రామ శివారులోని పొలంలో బర్రెలు మేత మేస్తుండగా ఈదురుగాలికి విద్యుత్‌ తీగలు తెగిపడడంతో విద్యుదాఘాతంతో ఆరు బర్రెలు మృతి చెందాయి. వీటిలో రెండు బర్రెల యజమానుల వివరాలు తెలియరాలేదని వాటికున్న ట్యాగ్‌ల ఆధారం గుర్తిస్తామని పశువైద్యాధికారి తెలిపారు. మృతి చెందిన బర్రెల విలువ రూ.3లక్షలు వరకు ఉంటుందని పేర్కొన్నారు.


logo