e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home నల్గొండ 4గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల

4గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల

కేతేపల్లి, జూలై 23 : మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా శుక్రవారం నీటి విడుదల కొనసాగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పెరిగిన ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో 8 గేట్ల ద్వారా కొనసాగిన నీటి విడుదలను 4 గేట్లకు కుదించారు. ప్రాజెక్టుకు 6,994 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అదేస్థాయిలో ఔట్‌ ఫ్లో కొనసాగిస్తున్నారు. ఒక్కో గేటును 6అడుగులు ఎత్తి 8,549 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా 251 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 639అడుగులు(2.99 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ ఉదయ్‌ తెలిపారు.

నాగార్జునసాగర్‌ జల సమాచారం
నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను శుక్రవారం 535.80 అడుగుల వద్ద 179.6902 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1000క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు 1000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana