e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home జిల్లాలు కేసీఆర్‌ పాలనలోనే కులవృత్తులకు పునరుజ్జీవం

కేసీఆర్‌ పాలనలోనే కులవృత్తులకు పునరుజ్జీవం

కేసీఆర్‌ పాలనలోనే కులవృత్తులకు పునరుజ్జీవం

సబ్సిడీ గొర్రెల యూనిట్‌ విలువ పెంపు, నిధుల కేటాయింపుపైయాదవుల హర్షం
సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు

హాలియా, జూలై 21 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలోనే కులవృత్తులు పునరుజ్జీవం పోసుకున్నాయని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. సబ్సిడీ గొర్రెల యూనిట్‌ విలువను రూ.1.25,000 నుంచి రూ.1,75,000 పెంచడంతోపాటు రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంపై బుధవారం హాలియాలో యాదవ సంఘం నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. యాదవుల ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు.. కార్యక్రమంలో మలిగిరెడ్డి లింగారెడ్డి, వెంపాటి శంకరయ్య, కూరాకుల వెంకటేశ్వర్లు, అంతయ్య, రావుల రాంబాబు, నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్‌నాయక్‌, రావుల లింగయ్య, వొర్ర వెంకట్‌రెడ్డి, ప్రసాద్‌నాయక్‌, అన్నెపాక శ్రీను, కిల్లారి కృష్ణ, కూరాకుల రవి, ఆవుల సైదులు, పిల్లి అభినయ్‌, పగడాల సైదులు పాల్గొన్నారు.
యాదవులకు సముచిత స్థానం
బొడ్రాయిబజార్‌ : సూర్యాపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఫ్లెక్సీకి సూర్యాపేట జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార యూనియన్‌ చైర్మన్‌ పోలెబోయిన నర్సయ్యయాదవ్‌, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ రామ్మూర్తియాదవ్‌ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాతే యాదవులకు సముచిత స్థానం లభించిందన్నారు. పెద్దగట్టు చైర్మన్‌ కోడి సైదులు, యాదవ ప్రముఖులు బడుగుల శ్రీనివాస్‌, జటంగి సైదులు, బోల్క వెంకట్‌, బొడ్డు కిరణ్‌, న్యాయవాది మల్లయ్య పాల్గొన్నారు.
నల్లగొండ పట్టణంలో..
నల్లగొండ : జిల్లా కేంద్రంలోని ఎనిమిదో వార్డులో టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గోసుల శ్రీను, పెద్ద జానయ్య, ఉపేందర్‌, శంకర్‌, బొమ్ము లింగయ్య పాల్గొన్నారు.
దామరచర్ల మండలంలో హర్షాతిరేకాలు
దామరచర్ల : సబ్సిడీ గొర్రెల యూనిట్ల విలువ పెంచడంపై మండలంలోని ఇర్కిగూడెం, వాడపల్లిలో యాదవులు సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. నాయకులు జక్కల అమరయ్య, సోమయ్య, కనకారావు, రామ్మూర్తి, జీడయ్య, గోపాల్‌రావు, పెద్దగొల్ల వెంకటేశ్వర్లు, సిద్ధయ్య, ఆశీర్వాదం పాల్గొన్నారు.
కనగల్‌ : మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి యాదవులు క్షీరాభిషేకం చేశారు. యాదవ సంఘం యువజన అధ్యక్షుడు మండలి పరమేశ్‌ యాదవ్‌, సర్పంచులు రామలచ్చయ్య, సింగం కోటేశ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ సింగం మల్లేశ్‌, వీరయ్య యాదవ్‌, శివకుమార్‌, ముత్యాల మధు, గణేశ్‌, జానీ, సైదులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేసీఆర్‌ పాలనలోనే కులవృత్తులకు పునరుజ్జీవం
కేసీఆర్‌ పాలనలోనే కులవృత్తులకు పునరుజ్జీవం
కేసీఆర్‌ పాలనలోనే కులవృత్తులకు పునరుజ్జీవం

ట్రెండింగ్‌

Advertisement