అభివృద్ధి పథం.. ఆహ్లాద వనం

- పల్లె ప్రగతితో మారిన యాద్గార్పల్లి
- డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు
- స్వచ్ఛతలో పట్టణానికి దీటుగా పనులు
మిర్యాలగూడ, ఫిబ్రవరి 23 : మిర్యాలగూడ పట్టణానికి కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామం యాద్గార్పల్లి గత పాలకుల నిర్లక్ష్యానికి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. కనీస వసతులు కూడా లేక గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. ఇరుకైన రోడ్లు, అస్తవ్యస్త పారిశుధ్యంతో అనారోగ్య వాతావరణంలో గడిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ గ్రామాభివృద్ధికి అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామ రూపురేఖలనే మార్చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రల్లె ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను వినియోగించుకొని గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటున్నారు. దీంతో పలు పథకాలతో గ్రామం పట్టణానికి దీటుగా రూపుదిద్దుకుంటున్నది.
గ్రామంలో 4,600 జనాభా ఉంది. సుమారు 1250 కుటుంబాలు నివాసం ఉంటుండగా 3,200మంది ఓటర్లు ఉన్నారు. ఊరి జనం ఎక్కువ శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామ శివారులో సుమారు 20 రైస్ మిల్లులు విస్తరించి ఉన్నాయి. దీంతో వందలాది మందికి దినసరి కూలి పని లభిస్తున్నది. పల్లె ప్రగతితో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, పల్లె పకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డు, అంతర్గత సీసీ రోడ్లు, డైనేజీలు నిర్మించగా మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధి చేసిన తాగునీరు ఇంటింటికీ అందుతున్నది. డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రకృతి వనంలో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు నాటి, చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎస్ఎస్జీ నిధులు రూ.40 లక్షలు, ఉపాధి హామీ నిధులు సుమారు రూ.50 లక్షలతో ఈ పనులు చేపట్టారు. ఇంటింటికీ ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు వందశాతం నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతిఇంటి ఎదుట హరితహారం మొక్కలు నాటి వాటికి రక్షణ ఏర్పాటు చేశారు. గ్రామాన్ని కలెక్టర్, డీపీఓ జిల్లా పరిషత్ సీఈఓ సందర్శించి ఇంకా బాగా తీర్చిదిద్ది ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికయ్యేలా చూడాలని సూచించారు.
పారిశుధ్యానికి ప్రాధాన్యం
గ్రామంలో పారిశుధ్యం పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకొని స్వచ్ఛతకు ప్రాధాన్యమిచ్చారు. గ్రామ పంచాయతీ తరఫున ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్తకు డబ్బాలు అందించి ట్రాక్టర్ ద్వారా సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డ్రైనేజీలను శుభ్రం చేయడంతో దోమలు వృద్ధి చెందకుండా ఉంటున్నాయి.
సుందరంగా తయారు చేశాం..
పల్లె ప్రగతితో మా గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. సీసీ రోడ్లు, డంపింగ్ యార్డు, డ్రైనేజీలు, మరుగు దొడ్లు, ప్రకృతి వనం పనులు పూర్తి చేసి అందంగా తయారు చేశాం. గ్రామాభివృద్ధికి గ్రామస్తులు, అధికారుల సహకారం సంపూర్తిగా లభిస్తున్నది. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం.
-దుండిగ యాదమ్మ, సర్పంచ్, యాద్గార్పల్లి
నిధుల విడుదలతో అభివృద్ధి
పల్లె ప్రగతికి ప్రభుత్వం నెలనెలా నిధులు విడుదల చేస్తుండడంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలతో గ్రామాలకు కొత్త కళ వచ్చింది. ప్రజాప్రతినిధులు పోటీగా పనులు చేస్తున్నారు.
-అజ్మీర దేవి, ఎంపీడీఓ, మిర్యాలగూడ
తాజావార్తలు
- ప్రియుడి కోసం సాయిపల్లవి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
- పల్లె, పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
- కాంగ్రెస్‌లో చేరిన నాథురాం గాడ్సే భక్తుడు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురుతో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్