శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 24, 2021 , 00:42:54

పండుగలా కదిలొచ్చారు

పండుగలా కదిలొచ్చారు

 • పల్లాకు పట్టభద్రుల మద్దతు
 • వేల మందితో కలిసి నామినేషన్‌కు రాజేశ్వర్‌రెడ్డి
 • మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతీరాథోడ్‌, 
 • పువ్వాడ అజయ్‌ కుమార్‌ హాజరు
 • మూడు ఉమ్మడి జిల్లాల నుంచి తరలివచ్చిన గులాబీ శ్రేణులు 
 • లక్ష్మీ గార్డెన్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ
 • ముందుండి నడిపించిన ఎమ్మెల్యేలు
 • నీలగిరి గులాబీమయం

ఉద్యమ నేతకు మద్దతుగా ఓరుగల్లు హోరెత్తింది. ఖమ్మం మెట్టు జై కొట్టింది.. పోరాటాల పురిటి గడ్డ నీలగిరి ముందుండి నడిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వాదంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతుగా తరలివచ్చిన మూడు ఉమ్మడి జిల్లాల టీఆర్‌ఎస్‌ శ్రేణులు, పట్టభద్రులతో నల్లగొండ గులాబీమయమైంది. డప్పు దరువులు, కళాకారుల నృత్యాల నడుమ కిలోమీటర్ల మేర పండుగ వాతావరణంలో ర్యాలీ సాగింది. జై తెలంగాణ, జై కేసీఆర్‌ నినాదాలు హోరెత్తాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డుకు ఒకవైపు మాత్రమే క్రమబద్ధంగా నడిచి గులాబీ శ్రేణులు మరొకమారు క్రమశిక్షణను చాటుకున్నాయి. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ డప్పు కొడుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ముందుండి ర్యాలీని నడిపించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

 • పల్లా గెలుపునే పట్టభద్రులు కోరుకుంటున్నారు
 • ప్రజల మేలు కోరి 
 • కేసీఆర్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ 

పథకాలు అమలు చేస్తుంటే, మోడీ గవర్నమెంట్‌ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి అదే పేదల దగ్గర డబ్బులు గుంజుతున్నది. గుడి, బడి, మసీదులు మేము కడుతుంటే కొందరు వాటి పేరు చెప్పి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నరు. కాంగ్రెస్‌, బీజేపీతోపాటు ఎన్నికల పేరు చెప్పి రక

 • రకాల జెండాలు పట్టుకొని వస్తున్నరు. ఎవరొచ్చినా 
 • కేసీఆర్‌ పరిపాలన, దార్శనికత ముందు కొట్టుకుపోవాల్సిందే. 
 • పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపును పట్టభద్రులు స్వచ్ఛందంగా కాంక్షిస్తున్నరు. రాష్ట్రానికి కేసీఆరే శ్రీ రామ రక్ష అని ప్రజలు విశ్వసిస్తున్నరు.
 • - మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
 • సమస్యల పరిష్కారానికి గొంతుకగా ఉంటా
 • త్యాగాలు, పోరాటాలకు పురిటి గడ్డలైన జిల్లాల్లో ఉద్యమ వారసులం మేము. ఇక్కడ ఓటు అడిగే హక్కు మాకే ఉన్నది. కాంగ్రెస్‌, 

బీజేపీకి ఎక్కడిది? ఆ పార్టీలకు పట్టభద్రులు కర్రు కాల్చి వాత పెడుతారు. సమస్యలకు పరిష్కారం చూపేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ మాత్రమే. 2014 తర్వాత రాష్ట్రంలో లక్షా 31వేల ఉద్యోగాలు ఇచ్చాం. కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ఉన్న ఉద్యోగాలు ఊడబీకుతున్నారు. ఆరేండ్లలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యనూ సీఎం కేసీఆర్‌ దగ్గరికి తీసుకెళ్లి పరిష్కరించా. మరొక అవకాశమిస్తే సమస్యలను పరిష్కరించే గొంతుకగా ఉంటా.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ 

పాల్గొన్న ప్రముఖులు...

శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌, బొల్లం మల్లయ్య యాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, రమావత్‌ రవీంద్రకుమార్‌, నల్లమోతు భాస్కర్‌రావు, పైళ్ల శేఖర్‌రెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, గుజ్జ దీపికా యుగంధర్‌రావు, ఎన్నికల ఇన్‌చార్జి కంచనపల్లి రవీందర్‌రావు, డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం తదితరులు 

పాల్గొన్నారు. 

నల్లగొండ, నీలగిరి, రామగిరి, నల్లగొండ రూరల్‌, ఫిబ్రవరి 23 : నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా మంగళవారం మూడు జిల్లాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో నల్లగొండ పట్టణం గులాబీమయమైంది. ‘జై తెలంగాణ’ నినాదాలతో నీలగిరి హోరెత్తింది. కేసీఆర్‌ జిందాబాద్‌, పల్లాకే మన మొదటి ప్రాధాన్యత ఓటు అంటూ నినదించారు. మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌, సత్యవతీరాథోడ్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, చైర్‌పర్సన్‌ ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు తరలిరాగా సుమారు ఆరు కిలోమీటర్లు ర్యాలీ కొనసాగింది. డప్పుల దరువు.. కోలాటం బృందాల ఆటపాటలు అలరించాయి. ఉదయం 10.30 గంటలకు లక్ష్మీగార్డెన్స్‌ నుంచి ప్రారంభమైన బైక్‌ ర్యాలీ సుమారు మూడు గంటల పాటు కొనసాగి కలెక్టరేట్‌కు చేరుకున్నది. ద్విచక్రవానాలు, కార్లు భారీగా తరలిరావడంతో రోడ్లపై ఎక్కడ చూసినా టీఆర్‌ఎస్‌ జెండాలే రెపరెపలాడాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి ర్యాలీలో నడుస్తూ వాహనాలన్నీ ఒకేవైపునకు వచ్చేలా సూచనలు చేశారు. 

కార్యకర్తలను ఉత్సాహ పరుస్తూ..

నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ర్యాలీ ఆద్యంతం కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో  తరలివచ్చిన కార్యకర్తలకు సూచనలు చేస్తూ ర్యాలీని విజయవంతం చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తోపాటు పలువురు నాయకులు డప్పు దరువు వేస్తూ కార్యకర్తలతో మమేకమయ్యారు. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నోముల భగత్‌ సైతం పాదయాత్రలో పాల్గొన్నారు. 

VIDEOS

logo