ఉపాధి అదనం

- - 20 నుంచి 30 శాతం ఎక్కువ కూలి
- - జూన్ వరకు వర్తింపు
- - వేసవి నేపథ్యంలో నిర్ణయం
నల్లగొండ, ఫిబ్రవరి 21 : ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. వేసవి నేపథ్యంలో ఎండ ప్రభావంతో పని ఎక్కువగా చేసే అవకాశం ఉండక పోవడం వల్ల కూలీలకు పొద్దుందాక పని చేసినప్పటికీ కనీస కూలి వచ్చే అవకాశం ఉండదు. దీంతో కొంత మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్ విడుదల చేసి ఈ ఫిబ్రవరిలో పని చేసిన కూలీలకు సైతం పెంచిన కూలిని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
పనికి మించిన వేతనం...
కేంద్ర ప్రభుత్వం వలసలు నివారించాలనే ఉద్దేశంతో 2006లో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలుత దినసరి కూలి రూ.49 ఉండగా, అనంతరం పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాన్ని సైతం పెంచుతూ ప్రస్తుతం రోజు కూలి రూ.237 ఇస్తుంది. సాధారణ రోజుల్లో ఈ కూలి అమలవుతుండగా వేసవిలో మాత్రం చేసిన పనికి మించిన కూలిని ఇస్తుంది. వేసవిలో ఎండ ప్రభావంతో రోజంతా కూలీలు పని చేయలేక పోవడం లేదంటే భూమి పెకిలించడం కష్ట తరంగా మారడం వల్ల నిర్దేశించిన కొలతల ప్రకారం చేసిన పనిని చూస్తే రోజు వారి కూలి పడదు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా వేసవిలో ఈ కూలి పెంపును ప్రభుత్వం చేపడుతుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు కూలి పెంచుతూ సర్క్యులర్ విడుదల చేసిన ప్రభుత్వం దీన్ని వెంటనే అమలు చేయాలని గ్రామీణాభివృద్ధ్ది యంత్రాంగాన్ని ఆదేశించింది.
కూలి పెంపు ఇలా..
కూలి పెంచడం ద్వారా సుమారు 3.50 లక్షల కుటుంబాలకు మేలు జరుగనుంది. ప్రస్తుతం అమలవుతున్న రూ.237 కూలికి ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం, జూన్లో 20శాతం అదనంగా లెక్కించి ఇవ్వనున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,68,133 జాబ్ కార్డులు ఉండగా 2 లక్షల కుటుంబాలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుంటున్నాయి. అయితే అందులో ప్రతి ఏటా సుమారు 3.50 లక్షల మంది కూలీలు పని చేసి వేతనం పొందుతున్నారు. ఇలా ప్రతి ఏటా జిల్లా వ్యాప్తంగా 70 నుంచి 85 లక్షల పని దినాలు కల్పిస్తున్న అధికారులు కూలి రూపంలో రూ.110 నుంచి రూ.125 కోట్ల వరకు అందజేస్తున్నారు.
తాజావార్తలు
- దీదీకి నడ్డా కౌంటర్ : అధికారంలోకి రాగానే రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు
- మీ మాజీ సీఎం చెప్పులు మోయడంలో నిపుణుడు..
- రాహుల్.. మీకు మత్స్యశాఖ ఉన్న విషయం కూడా తెలియదా?
- 15 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత
- ఉప్పెన దర్శకుడి రెండో సినిమా హీరో ఎవరో తెలుసా?
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కల్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు