శుక్రవారం 05 మార్చి 2021
Nalgonda - Feb 23, 2021 , 01:12:15

మండలి హంగామా

మండలి హంగామా

  • ఒక్క రోజే 34 నామినేషన్లు
  • నల్లగొండలో ‘పట్టభద్రుల’ కోలాహలం
  • ర్యాలీలు, సభలతో అభ్యర్థుల హడావుడి
  • ఇప్పటివరకు మొత్తం 68 సెట్ల నామినేషన్లు, 
  • 48 మంది అభ్యర్థులు నేడు చివరి రోజు

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకున్నది. ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుండగా.. ఇప్పటివరకు 48 మంది అభ్యర్థులు 68 సెట్లు దాఖలు చేశారు. సోమవారం ఒక్క రోజే 34 సెట్ల నామినేషన్లు వచ్చాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు, వారి అనుచరులు పెద్దఎత్తున తరలిరావడంతో నల్లగొండ పట్టణంలో కోలాహలం నెలకొన్నది. సభలు, సమావేశాలు, ర్యాలీలతో అంతటా హంగామా కనిపించింది. చివరి రోజైన మంగళవారం కూడా నామినేషన్లు భారీగా దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

నేడు పల్లా నామినేషన్‌

ప్రస్తుత ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి  మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతీరాథోడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు ఆ పార్టీకి చెందిన మూడు ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలివచ్చేందుకు సన్నద్ధ మవుతున్నారు. అందరూ కలిసి ఉదయం 11గంటలకు హైదరాబాద్‌ రోడ్డులోని లక్ష్మీ గార్డెన్స్‌ నుంచి ఎన్జీ కాలేజీ వరకు బైక్‌ ర్యాలీగా వెళ్తారు. క్లాక్‌టవర్‌ సెంటర్‌లోని అమరవీరుల  స్తూపానికి నివాళులర్పించి ప్రకాశంబజార్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు ర్యాలీ కొనసాగనుంది. కలెక్టరేట్‌లో మంత్రులతో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు.

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి22(నమస్తే తెలంగాణ): శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. ప్రధాన పార్టీలకు తోడు పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మంగళవారం చివరి రోజు కూడా నామినేషన్ల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని తెలుస్తున్నది. శనివారం నాటికి 30 మంది అభ్యర్థులు 34 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. సోమవారం మరో 34 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం 48 మంది అభ్యర్థులు 68సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు మరి కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఒకటికి మించి నామినేషన్‌ సెట్లను దాఖలు చేశారు. 

 జిల్లా కేంద్రంలో కోలాహలం

సోమవారం ప్రధాన పార్టీలతో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు సైతం కార్యకర్తలు, అనుచరులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పట్టణంలో ఎటుచూసినా ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల కోలాహలం కనిపించింది. కలెక్టరేట్‌ ప్రాంగణమంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు కూడా ప్రత్యేకంగా బందోబస్తు చర్యలు చేపట్టారు. సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బీజేపీ అభ్యర్థ్ధి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థ్ధ్ధి గోగుల రాణీ రుద్రమరెడ్డి, తెలంగాణ జనసమితి అభ్యర్థి కోదండరామ్‌రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అభ్యర్థ్ధ్ధి చెరుకు సుధాకర్‌ స్వయంగా కలెక్టరేట్‌కు రాగా సీపీఐ అభ్యర్థ్ధి జయసారథిరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థ్ధి రాములునాయక్‌  తరఫున ప్రతిపాదకులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు ఇండియన్‌ నేషనల్‌ యువజనపార్టీ అభ్యర్థ్ధ్ధిగా ఇంజపురి రాధాకృష్ణ, యువతరం పార్టీ నుంచి కొర్లకంటి ప్రకాశ్‌రావు, స్వతంత్ర అభ్యర్థులుగా సూదగాని హరిశంకర్‌గౌడ్‌, లింగిడి వెంకటేశ్వర్లు, గుంటూరు వెంకటనారాయణ, ముడుదుడ్ల రమేశ్‌, డాక్టర్‌ గుత్తా రవీందర్‌రెడ్డి, షేక్‌ షబ్బీర్‌ అలీ, మండపుడి శివప్రసాద్‌, పెండ రమేశ్‌, సుంకేపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కొండ రాధాకృష్ణ, మామిడి అంబేద్కర్‌, గద్దల అప్పారావు, భారతీ కురాకుల, కౌటం రవీందర్‌, తీన్మార్‌ మల్లన్న, పాటి రవీందర్‌, నందిపాటి జానయ్య, కర్నె రవి, బరిగెల దుర్గాప్రసాద్‌ మహారాజ్‌, గడ్డం సదానంద్‌, డాక్టర్‌ కొల్ల నర్సింహారావులు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. 

నేడు చివరి రోజు

నేడు నామినేషన్లకు చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థ్ధ్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేడు నామినేషన్లు దాఖలు చేసే ప్రముఖుల్లో ఉండగా సీపీఐ అభ్యర్థ్ధి జయసారథిరెడ్డి కూడా వేయనున్నారు. 

VIDEOS

logo