ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 22, 2021 , 01:37:13

కనుల పండువగా శేషవాహన సేవ

కనుల పండువగా శేషవాహన సేవ

  • భక్తిశ్రద్ధలతో పార్వతీ రామలింగేశ్వరుల ఊరేగింపు
  • చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల్లో నేడు అగ్నిగుండాలు

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 21 : చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున శేషవాహన సేవ కనుల పండువగా జరిగింది. భక్తుల జయజయ ధ్వానాలు, శివసత్తుల పూనకాల నడుమ స్వామివారి సేవా కార్యక్రమాలను ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మరోవైపు ఆలయంలో దీక్షా హోమాలు, రుద్రహోమం, బలిహరణం, సరస్వతీ పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం, ఆంజనేయ స్వామికి లక్ష తమలపాకుల అర్చన జరిపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ మేకల అరుణారాజిరెడ్డి, ఇన్‌చార్జి ఈఓ మహేంద్రకుమార్‌, ధర్మకర్తలు పాల్గొన్నారు. 

నేడు అగ్నిగుండాలు...

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున స్వామివారి అగ్నిగుండాలు, పర్వతవాహన సేవ ఘనంగా నిర్వహించనున్నారు. రైతులు తాము పండించిన ఆముదాలు, కందులు, చిరు ధాన్యాలు తీసుకువచ్చి అగ్ని గుండంలో వేసి మొక్కు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా భక్తులంతా ఓం నమఃశివాయ నామాన్ని స్మరిస్తూ కణకణలాడే నిప్పుల పైనుంచి నడుస్తారు.

VIDEOS

logo