మంగళవారం 09 మార్చి 2021
Nalgonda - Feb 22, 2021 , 01:37:15

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  • ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 
  • సీపీఎం, టీడీపీ నుంచి 25 కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరిక

కట్టంగూర్‌, ఫిబ్రవరి 21: సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంపంచాయతీ పరిధిలోని తొట్లవారిగూడెంలో వార్డు సభ్యుడు తొట్ల నాగమ్మాయాదయ్య, నాయకులు తొట్ల నర్సింహ, తొట్ల రవి ఆధ్వర్యంలో సీపీఎం, టీడీపీకి చెందిన 25కుటుంబాల సభ్యులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువత టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నూక సైదులు, గార్లబాయిగూడెం సర్పంచ్‌ బోడ సరితాయాదయ్య, మాజీ ఎంపీటీసీ గుండగోని రాములు, బీరెల్లి ప్రసాద్‌, అంతటి శ్రీను, పల్నాటి నరేందర్‌రెడ్డి, తీగల కృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

VIDEOS

logo