టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి

ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి
జోరుగా పార్టీ సభ్యత్వాల నమోదు
నల్లగొండ/ మర్రిగూడ/ నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 21 : టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామాలతోపాటు పట్టణాలకు అధిక నిధులు విడుదల చేయడంతో ఎంతో అభివృద్ధి చెందాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని 48వ వార్డు నాగార్జున కాలనీలో ఆదివారం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి అనేక మంది టీఆర్ఎస్లో కొనసాగుతూ సభ్యత్వాలు స్వచ్ఛందంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాంచందర్‌రెడ్డి, పారెపల్లి శ్రీనివాస్, కృష్ణ, సుధాకర్‌రెడ్డి, నాంపల్లి మనోహర్, సోమయ్య, రాంబాబు, వెంకటాద్రి, ప్రకాశ్, యాదగిరి, మల్లేశ్, శంకర్, నర్సింహ, శంకర్‌రెడ్డి, శ్రవణ్‌గౌడ్ పాల్గొన్నారు. మర్రిగూడ మండలం ఇందుర్తిలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ఐతగోని యాదగిరిగౌడ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. బీసీ సెల్ మండల అధ్యక్షుడు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ యాసీన్అలీ, గణేశ్, రఘుగౌడ్, యాదగిరి, భిక్షం పాల్గొన్నారు. నల్లగొండ మండలం చెన్నుగూడెంలో జిల్లా నాయకుడు బకరం వెంకన్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. సర్పంచ్ గుండెబోయిన శ్రీలత, జంగయ్య, ఉప సర్పంచ్ అంజయ్య, జానయ్య, రమేశ్, ఎల్లయ్య, రవి, భిక్షం, నరసింహ, యాదయ్య, సైదులు, సత్తయ్య, రాములు, శిరీష, కోటేశ్, వెంకటేశ్, నరేశ్ పాల్గొన్నారు.కార్యకర్తల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయం
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్, ఫిబ్రవరి 21 : కార్యకర్తల సంక్షేమానికి టీఆర్ఎస్ అధిక ప్రాధాన్యమిస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పరడ, కల్మెర గ్రామాల్లో పార్టీ సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన టీఆర్ఎస్కు కార్యకర్తలే కొండంత బలమని, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రమాదవశాత్తు కార్యకర్తలు మృతిచెందితే పార్టీ బీమా రూ.2 లక్షలు అందిస్తుందన్నారు. జడ్పీటీసీ తరాల బలరాములు, సర్పంచులు సుజనావెంకట్రెడ్డి, నర్సిరెడ్డి, ఎంపీటీసీ పురుషోత్తంరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు శ్రీనివాస్, సరోజనారాంరెడ్డి, జానకిరెడ్డి, గ్రామాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, నాయకులు రామలింగయ్య, వెంకన్న, నర్సింహ, వెంకట్‌రెడ్డి, నగేశ్, వెంకటచారి, శేఖర్‌రెడ్డి, నర్సిరెడ్డి, యాదయ్య, ప్రసాద్, నరేందర్‌రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.
తాజావార్తలు
- కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
- విద్యార్థినికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
- వామన్‌రావు హత్య కేసు సీబీఐకి ఇవ్వండి
- మహిళా దినోత్సవం నిర్వహణకు కమిటీ
- ఎన్ఏఈబీ సభ్యుడిగా శ్రీనివాస్‌రెడ్డి
- మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
- ‘వెల్చేరు’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
- ఖనిజ నిధులతో అభివృద్ధి
- ముగిసిన జిల్లా స్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్