గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 21, 2021 , 01:15:42

టీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి

  • పార్టీ రాష్ట్ర నాయకుడు నోముల భగత్‌
  • మండలాల్లో ముమ్మరంగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

మాడ్గులపల్లి, నందికొండ, ఫిబ్రవరి20: టీఆర్‌ఎస్‌ పాలనలోనే రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తున్నదని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నోముల భగత్‌కుమార్‌ అన్నారు. శనివారం మాడ్గులపల్లి మండలంలోని గోపాలపురంలో, నందికొండలోని హిల్‌ కాలనీలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు పగిళ్ల సైదులు, చింతరెడ్డి యాదగిరిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌, కాకునూరి వెంకన్న, నందికొండలో కర్న శరత్‌రెడ్డి, మందరఘువీర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

సభ్యత్వ నమోదులో ముందుంచాలి : చాడ

పెద్దవూర : టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో పెద్దవూర మండలాన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంచాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పెద్దగూడెం, శిరసనగండ్ల, కొత్తలూరు, బసిరెడ్డిపల్లి, బట్టుగూడెం, వెల్మగూడెం, గర్నెకుంట గ్రామాల్లో పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, వైస్‌ ఎంపీపీ గోనె వివేక్‌రావు, నాయకులు రవినాయక్‌, అంతయ్య, షేక్‌ అబ్బాస్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

త్రిపురారంలో 80శాతం పూర్తి : తిప్పన

త్రిపురారం : టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు మండలంలో 80 శాతం పూర్తయ్యిందని సభ్యత్వ నమోదు మండల ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం ఖాయమన్నారు. ఆయన వెంట నిడమనూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కామెర్ల జానయ్య, పార్టీ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్‌, సర్పంచ్‌ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు జంగిలి శ్రీనివాస్‌, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అనంతరెడ్డి పాల్గొన్నారు.

అడవిదేవులపల్లి : మండలంలోని ఉల్సాయిపాలెం గ్రామంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును ఎంపీపీ ధనావత్‌ బాలాజీనాయక్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు స్వామి, లక్పతి శ్రీనివాస్‌, శివ, సోమిరెడ్డి, వల్య పాల్గొన్నారు.  

నిడమనూరు: మండలంలోని ముకుందాపురం, ఇండ్లకోటయ్య గూడెం, బొక్కమంతల పహాడ్‌, వెంగన్న గూడెం, వేంపాడు గ్రామాల్లో పార్టీ సభ్యత్వ నమోదు మండల ఇన్‌చార్జి గార్లపాటి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. శాఖాపురం గ్రామంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు చేకూరి హనుమంతరావు ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు కేవీ రామారావు, మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌  అంకతి వెంకటరమణ, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ నూకల వెంకట్‌ రెడ్డి, సర్పంచ్‌ కేశ శంకర్‌, నాయకులు మేరెడ్డి వెంకటరమణ, ఆర్పెనబోయిన వెంకన్న, ఉప సర్పంచ్‌ పొలగాని వెంకటయ్య, అల్వాల కళావతి పాల్గొన్నారు. 

హాలియా : మండలంలోని రామడుగు, చింతగూడెం, యాచారం, ముక్కామల, అన్నారం గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓ.నర్సింహారెడ్డి పార్టీ  మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. 

డిండి : మండలంలోని ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును పార్టీ మండలాధ్యక్షుడు తూము నాగార్జున్‌రెడ్డి ప్రారంభించారు. దేవరకొండ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ జంగారెడ్డి, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, భగవంతరావు, జయంత్‌, శ్రీనివాస్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, జైపాల్‌ పాల్గొన్నారు. 

దేవరకొండ : పట్టణంలోని 16వ వార్డులో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును శనివారం మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ ప్రారంభించారు. సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బురాన్‌, నాయకులు భీష్మ, గార్లపాటి దామోదర్‌, వాస వెంకటేశ్వర్లు, రెవెళ్లి వెంకటయ్య, చంద్రమౌళి, కళమ్మ పాల్గొన్నారు.

VIDEOS

logo