శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 20, 2021 , 01:10:22

బంజారాల ఔన్నత్యాన్ని చాటిన సేవాలాల్‌

బంజారాల ఔన్నత్యాన్ని చాటిన సేవాలాల్‌

  • నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ 

నీలగిరి, ఫిబ్రవరి 19 : బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 282 జయంత్యుత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతకుముందు సేవాలాల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీ మాట్లాడుతూ అడవుల్లో జీవిస్తున్న గిరిజనులకు మంచి సంప్రదాయాలు, సంస్కృతిని అలవర్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ మాట్లాడుతూ సంత్‌ సేవాలాల్‌ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏఓ మోతీలాల్‌, డీటీడీఓ ఫిరంగి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రదీప్‌నాయక్‌, తిరుమలగిరి సాగర్‌ ఎంపీపీ భగవాన్‌ నాయక్‌, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి నర్సింహ, గిరిజన నాయకులు రవినాయక్‌, నాగార్జున పాల్గొన్నారు.

VIDEOS

logo