ఆదివారం 07 మార్చి 2021
Nalgonda - Feb 19, 2021 , 02:47:57

రోజుకు కోటికి పైనే..

రోజుకు కోటికి పైనే..

  •  ఉమ్మడి జిల్లాలో పుంజుకున్న రియల్‌రంగం 
  • జనాలతో రద్దీగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు
  •  కొత్త ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరి

నీలగిరి ఫిబ్రవరి 18:  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో  ఊపందుకున్నాయి. నల్లగొండ జిల్లాకేంద్రంతోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, చండూర్‌, నకిరేకల్‌,  నిడుమనూరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, బీబీనగర్‌, చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట, మోత్కూరు, రామన్నపేట, సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు హుజూర్‌నగర్‌, కోదాడలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. డిసెంబర్‌ 29 నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించడం, ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలు సైతం ఎత్తివేయడంతో క్రయ, విక్రయదారుల రాకతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు పూర్వవైభవం వచ్చింది. 

 రూ.67.01 కోట్ల ఆదాయం 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు నెలల తర్వాత తిరిగి రిజిస్ట్రేషన్లు మొదలవ్వగా 60 రోజుల్లోనే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలో 35,825 రిజిస్ట్రేషన్లు పూర్తికాగా రూ.67.01 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా నల్లగొండ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ. 11.85 కోట్లు ఆదాయం రాగా, అత్యల్పంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరులో రూ.29.03 లక్షలు వచ్చింది.   

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే రిజిస్ట్రేషన్లు

జిల్లాలోని 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలో కొనసాగుతున్నాయి. ఎలాంటి సాంకేతిక సమస్య లేదు. లింక్‌ డాక్యుమెంట్లు ఉన్న వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. కొత్తగా వచ్చే వాటికి మాత్రం ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 35825 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేయగా రూ. 67.01కోట్ల ఆదాయం వచ్చింది. 

VIDEOS

logo