సభ్యత్వ నమోదులో వేగం పెంచాలి

నడిగూడెం, ఫిబ్రవరి 18 : సభ్యత్వ నమోదులో వేగం పెంచాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి కంచర్ల రామకృష్ణారెడ్డి సూచించారు. సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంతోపాటు కరివిరాల, రామంచంద్రాపురం గ్రామాల్లో సభ్యత్వాల నమోదును పరిశీలించారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రతి కార్యకర్త విధిగా సభ్యత్వం పొందాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, మండల ఇన్చార్జి నూకల మధుసూదన్‌రెడ్డి, సుంకర అజయ్‌కుమార్, పార్టీ మండలాధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, బడేటి చంద్రయ్య, నాయకులు పాలడుగు ప్రసాద్, సురేశ్ప్రసాద్, గణపతి శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నూనె నాగన్న, గడ్డం నాగలక్ష్మీమల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ పథకాలు..
మోతె, ఫిబ్రవరి 18 : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సర్వారం, కూడలి గ్రామాల్లో టీఆర్ఎస్ సభ్యత్వాలను అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, నాయకులు సుంకర అజయ్‌కుమార్, బట్టు శివాజీనాయక్, ఏలూరి వెంకటేశ్వర్రావు, ముప్పాని శ్రీకాంత్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మల్సూర్, ఆర్కే నాయక్, నర్సింహారావు, యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.
35వేల సభ్యత్వాలు నమోదు..
కోదాడ, ఫిబ్రవరి 18 : నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 35వేలు పూర్తిచేసినట్లు జిల్లా ఇన్చార్జి కంచర్ల కృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 28వరకు సభ్యత్వ నమోదు నిర్వహించి ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి, జడ్పీటీసీ ఉమాశ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, పట్టణ ఇన్చార్జి పుల్లారెడ్డి, అల్తాఫ్ హుస్సేన్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఏపీలో ఘోర ప్రమాదం : ముగ్గురు మృతి
- అఫీషియల్: ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు
- శివరాత్రి ఉత్సవాలు.. మంత్రి ఐకే రెడ్డికి ఆహ్వానం
- బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్