గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 18, 2021 , 01:18:21

23న పల్లా నామినేషన్‌

23న పల్లా నామినేషన్‌

  • పెద్దఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులు, పట్టభద్రులకు విజ్ఞప్తి
  • సీఎం కేసీఆర్‌ నుంచి బీ ఫామ్‌ అందుకున్న రాజేశ్వర్‌రెడ్డి

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలికి ఈ నెల 23న నామినేషన్‌ వేసేందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. మూడు పాత జిల్లాలతో కూడిన నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులను, పార్టీ శ్రేణులు, పట్టభద్ర ఓటర్లు, మిత్రులను నామినేషన్‌ కార్యక్రమానికి ఆహ్వానించారు. తనకు మద్దతుగా పెద్దఎత్తున తరలిరావాలని బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.  ఆ రోజు ఉదయం 10 గంటల వరకు అంతా నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.  కాగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి   సీఎం కేసీఆర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థ్ధిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కేసీఆర్‌ పార్టీ బీ-ఫామ్‌ను అందజేశారు. మరోసారి పార్టీ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు   పల్లా రాజేశ్వర్‌రెడ్డి  ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 


VIDEOS

logo