సోమవారం 08 మార్చి 2021
Nalgonda - Feb 18, 2021 , 01:18:21

జన వన మన

జన వన మన

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 
  • ఆకుపచ్చ కానుక
  • పండుగ వాతావరణంలో కోటి వృక్షార్చన
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జననేత జన్మదిన వేడుకలు
  • సూర్యాపేటలో రైతులతో కలిసిమొక్కలు నాటిన మంత్రి జగదీశ్‌రెడ్డి
  • ఎక్కడికక్కడ పాల్గొన్న జడ్పీ చైర్మన్లు,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు 
  • పలుచోట్ల కేక్‌ కటింగ్‌లు, అన్నదానాలు

పుడమి తల్లి ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు కళకళలాడుతున్న ఈ నేల ఒకప్పుడు చుక్కనీరు లేక నెర్రెలు వారి రైతన్న కన్నీళ్లతో మాత్రమే తడిచేది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టులతో గోదావరి జలాలను తీసుకురావడంతో అర్వపల్లి శివారులోని ఈ భూములన్నీ గత యాసంగి నుంచి సాగులోకి వచ్చి సిరులు పండిస్తున్నాయి. ఆ కృతజ్ఞతలతో గ్రామ రైతులు, యువకులు అపర భగీరథుడి పుట్టిన రోజును పంట పొలాల మధ్య పండుగలా జరుపుకొన్నారు. కేక్‌ కట్‌ చేసి జేజేలు పలికారు.

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి17(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యాపేట మున్సిపాలిటీ ప్రజలు కేసీఆర్‌ 67వ జన్మదినాన్ని పురస్కరించుకుని 6700మొక్కలను నాటి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి భారీ కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం మార్కెట్‌యార్డులో మొక్కలు నాటి రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం ప్రారంభించారు. సూర్యాపేట మండల పరిధిలోని కాసరాబాద్‌లో రెండు వేల మొక్కలు నాటే కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాల్లో జన్మదిన వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అన్ని నియోజకవర్గాల్లో కోటి వృక్షార్చనకు అనూహ్య స్పందన లభించింది. గ్రామగ్రామాన ప్రజలంతా భాగస్వాములై జిల్లా అంతటా 5లక్షల మొక్కలు నాటారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం మఠంపల్లిలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మొక్కలు నాటి కేక్‌ కట్‌ చేశారు. హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని వేణుగోపాల సీతారామచంద్ర స్వామి ఫణిగిరి గుట్ట పరిధిలో ఎమ్మెల్యే సైదిరెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఇందిరాచౌక్‌ సమీపంలో కేక్‌ కట్‌ చేసి రైస్‌ మిల్లర్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. కోదాడ నియోజకవర్గవ్యాప్తంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పెద్ద ఎత్తున మొక్కలు నాటగా... శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లిన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అక్కడే మొక్కలు నాటారు. తుంగతుర్తిలో జడ్పీ చైర్మన్‌ దీపికా యుగంధర్‌రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటి, కేక్‌ కట్‌ చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా అన్నిచోట్ల మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగింది. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ తెలంగాణభవన్‌లో మొక్కలు నాటి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  

నల్లగొండ జిల్లాలో...

నల్లగొండ జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు, కేసీఆర్‌ అభిమానులు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నిచోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యమిచ్చారు. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల పరిధిలో ఎక్కడికక్కడే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొత్తంగా జిల్లాలో 10లక్షల మొక్కలు నాటుకున్నాయి. నల్లగొండలోని టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో,  బాలాజీ హోమ్స్‌ కాలనీలో జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి కేక్‌కట్‌ చేశారు. జడ్పీ కార్యాలయంలోనూ సభ్యులతో కలిసి చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి మొక్కలు నాటి కేక్‌ కట్‌ చేశారు. క్లాక్‌టవర్‌ సెంటర్‌లో జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. మిర్యాలగూడ నియోజకవర్గవ్యాప్తంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుకున్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని వాసవీకాలనీతో పాటు మండల పరిధిలోని జంకుతండాలో స్థానికులు, పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కేక్‌ కట్‌ చేసి మొక్కలు నాటారు. దేవరకొండ పట్టణంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి మొక్కలు నాటారు. పలుచోట్ల కేక్‌కట్‌ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్‌, నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ శ్రేణులతో కలిసి కేక్‌కట్‌ చేసి సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కట్టంగూర్‌ మండలం అయిటిపాములలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో వెయ్యికి పైగా మొక్కలు నాటారు. మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. చండూర్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన కుటుంబసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొని మొక్కలు నాటారు. ఇక నాగార్జునసాగర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసీఆర్‌ జన్మదిన వేడుకలు జరిగాయి. పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఇందులో పాల్గొన్నారు. హాలియాతో పాటు నిడమనూర్‌ మండలం వేంపాడులో ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కేక్‌కట్‌ చేసి మొక్కలు నాటారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రక్తదానం చేశారు. బుద్ధవనంలో ఎస్‌ఈ క్రాంతిబాబు ఆధ్వర్యంలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు, సిబ్బంది 2వేల మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్‌ చొరవతో నిర్మాణం పూర్తవు తున్న బుద్ధవనం తెలంగాణకు మణిహారంగా నిలుస్తున్నదని ఎస్‌ఈ పేర్కొన్నారు. ఓఎస్‌డీ సుధాన్‌రెడ్డి, భుజంగ్‌ రామారావు, భాస్కర్‌రెడ్డి, శ్యామ్‌ సుందర్‌, ఏఈ జగదీశ్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo