గురువారం 04 మార్చి 2021
Nalgonda - Feb 15, 2021 , 00:04:32

సభ్యత్వ నమోదులో కార్యకర్తలు ముందుండాలి

సభ్యత్వ నమోదులో కార్యకర్తలు ముందుండాలి

  •  ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి 

హాలియా, ఫిబ్రవరి14 : టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదులో కార్యకర్తలు ముందుండాలని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కోరారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం హాలియాకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతమున్న  అన్ని ప్రాంతీయ పార్టీల్లో టీఆర్‌ఎస్‌ బలమైన పార్టీగా ఉందన్నారు. ఇప్పటికే పార్టీకి 60 లక్షల మంది క్రియాశీలక సభ్యులున్నారని, ఈసారి ఆ సంఖ్యను 80 లక్షలకు పెంచాలని పార్టీ నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్‌లు, 122 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో  తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. దేశంలో పంజాబ్‌ తర్వాత అత్యధికంగా వరి పంట దిగుబడి సాధించింది తెలంగాణ మాత్రమే అన్నారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో 80వేల సభ్యత్వం పూర్తి చేయాలని కోరారు. త్వరలో జరుగనున్న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమన్నారు. ఆయన వెంట త్రిపురారం, తిరుమలగిరి సాగర్‌ మండలాల పార్టీ అధ్యక్షులు  బహునూతల నరేందర్‌, పిడిగం నాగయ్య, నాయకులు చేగొండి కృష్ణయ్య, భరత్‌రెడ్డి, అనంత రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఉన్నారు. 

ఎమ్మెల్సీ  కవితను కలిసిన తేరా

తేరా చిన్నపరెడ్డి  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆదివారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. 18న ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్‌ను కలువనున్న దృష్ట్యా ఎజెండాపై చర్చించినట్లు  విలేకరులకు తెలిపారు.  


VIDEOS

logo