శనివారం 06 మార్చి 2021
Nalgonda - Feb 14, 2021 , 00:57:51

సాగుకు సాంకేతికత తోడైతే మంచి ఫలితాలు

సాగుకు సాంకేతికత తోడైతే మంచి ఫలితాలు

  • మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్లగొండ, ఫిబ్రవరి 13 : వ్యవసాయ సాగుకు సాంకేతికత సేవలు తోడైతే మంచి ఫలితాలు వస్తాయని  విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల  జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సాగర్‌ రోడ్డులో ఉషా గార్డెన్స్‌లో సంహిత క్రాప్‌ కేర్‌ క్లినిక్స్‌ సీఈఓ గున్నం శ్యాంప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరించారు. బత్తాయి, నిమ్మ రైతులకు సలహాలు ఇవ్వడం హర్షణీమన్నారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయం అభివృద్ధికి అనేక ఆధునిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధిస్తే మొదటగా ముఖ్యమంత్రి కేసీఆరే సంతోషపడతారని అన్నారు. ఈ సందర్భంగా పంటల సంరక్షణపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, కళ్యాణి, విజయ్‌, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

సహ చట్టంతో జవాబుదారితనం 

నీలగిరి, ఫిబ్రవరి 13 :  సమాచార హక్కు చట్టంతో జవాబుదారితనం పెరిగిందని మంత్రి  జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఓ హాల్‌లో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో  ఐసీడీఎస్‌ ఆర్‌ఓ మాలే శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్‌, కృష్ణారెడ్డి, సత్యనారాయణగుప్తా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

VIDEOS

logo