మంగళవారం 02 మార్చి 2021
Nalgonda - Feb 14, 2021 , 01:00:33

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌ పార్టీ

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌ పార్టీ

  • మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి

మిర్యాలగూడ,ఫిబ్రవరి13 : కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ ఎల్లవేళలా అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలకు రూ.2లక్షల ప్రమాద బీమా అందిస్తుందన్నారు. రాష్ట్రంలో నిరుపేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు యాదగిరిరెడ్డి, అన్నభీమోజు నాగార్జునాచారి, చిట్టిబాబునాయక్‌,  కుర్ర కోటేశ్వర్‌రావు, జొన్నలగడ్డ రంగారెడ్డి, యూసుఫ్‌, హతీరాం, వీరకోటిరెడ్డి, ఏడుకొండలు పాల్గొన్నారు.  

టీఆర్‌ఎస్‌ సభ్యత్వనమోదు ప్రారంభం

దేవరకొండ, ఫిబ్రవరి 13 : టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును శనివారం దేవరకొండలో పార్టీ పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కౌన్సిలర్‌ వడ్త్య దేవేందర్‌నాయక్‌కు సభ్యత్వం అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రైస్‌, జయప్రకాశ్‌నారాయణ, నాయకులు తౌఫిక్‌, పి. సైదులు, ఆశోక్‌, ప్రదీప్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo