వరాల జల్లు

- స్థానిక సంస్థలకు రూ.186 కోట్ల ప్రత్యేక నిధులు
- రూ.600 కోట్లతో పెద్దదేవులపల్లికి గోదావరి నీళ్లు లిఫ్ట్
- నెల్లికల్లు భూ సమస్యకు త్వరలో పరిష్కారం
- నెల్లికల్లు ఆయకట్టును 30వేల ఎకరాలకు పెంచే యోచన
- ఎత్తిపోతల పథకాలన్నీ ఏడాదిన్నరలో పూర్తి
- కొత్తగా తోపుచర్ల, వీర్లపాలెం లిఫ్ట్ హామీ
- డిండి, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణవెల్లెంలకు బడ్జెట్లో నిధులు
- యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు రెండేండ్లలో పూర్తి
- సాగర్ ఉప ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్కే..
- ధన్యవాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
- నల్లగొండ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్
- వరాల జల్లు కురిపించారు. ప్రతి గ్రామపంచాయతీకి
- ఉప్పొంగిన అభిమానం
ఒక విన్నపం
నల్లగొండ జిల్లా ప్రజలు చైతన్యవంతులు. విచక్షణతోని ఆలోచన చెయ్యాలె. వాస్తవాలు గమనించాలె. న్యాయమైన తీర్పు చెప్పాలె. అలా చేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కుల, మత భేదం లేకుండా, అవినీతి రహితంగాప్రజల కోసం సేవ చేస్తున్న పార్టీని, ప్రభుత్వాన్ని ఆదరించాలె. ధర్మాన్ని గెలిపించాలె. మీ దీవెనలే మాకు కొండంత బలం.రూ.20 లక్షలు, మండల కేంద్రానికి 30 లక్షలు, నల్లగొండ మున్సిపాలిటీకి 10 కోట్లు, మిర్యాలగూడకు రూ.5 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. నెల్లికల్ వద్ద బుధవారం శంకుస్థాపన చేసిన 13 ఎత్తిపోతల పథకాలను ఏడాదిన్నర లోపు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. నెల్లికల్లు చుట్టుపక్కల గ్రామాల్లోని భూ సమస్యకు అతి త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. డిండి, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసేందుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. కొత్తగా తోపుచర్ల, వీర్లపాలెం లిఫ్టుల మంజూరు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. గత పాలకులు చేసిన అన్యాయాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ... వాటిని ఆరున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా సరిదిద్దుతున్నదో విడమరిచి చెప్పారు. టీఆర్ఎస్కు మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉన్నదని, సాగర్ ఉప ఎన్నికల్లో మిగతా పార్టీలకు డిపాజిట్ రాకుండా గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ధన్యవాద సభ సక్సెస్ టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది.
జనసాగరం
సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న
సాగర్ ఆయకట్టులో జవసత్వాలు
నింపేందుకు అపరభగీరథుడు తరలిరాగా.. కృష్ణమ్మే ప్రణమిల్లి తనబిడ్డలకు దారి చూపింది. పొగిళ్ల మొదలు వెల్లటూరు దాకా చివరి భూములను సస్యశ్యామలం చేసేందుకు నల్లగొండ జిల్లా నెల్లికల్ దగ్గర బుధవారం 13
ఎత్తిపోతల పథకాలకు పునాది
రాయి పడింది. మా నీళ్లు మాకేనంటూ మర్లవడ్డ ఉద్యమ నాయకుడు.. ఆడిన మాట తప్పని ప్రభుత్వాధినేతై నవ శకానికి నాంది పలుకడం చూసి అన్నదాత మది పులకరించింది. ఉప్పొంగిన అభిమానంతో హాలియా జనసాగరమైంది. దిక్కులు పిక్కటిల్లేలా కృష్ణపట్టె ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జై కొట్టింది. నల్లగొండ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన సకల జనులతో సభా ప్రాంగణమైన 14వ మైలురాయి కిక్కిరిసింది. వివక్షను ఎండగడుతూ..
అభివృద్ధిని వివరిస్తూ
సాగిన సీఎం ప్రసంగం ఆద్యంతం ఆలోచింపజేసింది. ఊర్రూతలూగించింది.
ఒక యాది
తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన కొత్తలో చంద్రబాబు ముఖ్యమంత్రి. సాగర్ ఎడమ కాల్వకు నీళ్లిస్తమన్నరు. సడన్‌గా నీళ్లు బంద్ పెట్టిన్రు. ఆ రోజు నేనే స్వయంగా నాగార్జున సాగర్ కట్టమీదికి వచ్చిన. 50వేల మందితో మీటింగ్ పెట్టి, గవర్నమెంట్‌కు వార్నింగ్ ఇచ్చి తెల్లారే సరికి నీళ్లు తెచ్చిన. సాగర్ ఆయకట్టు కోసం 2003లోనే కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసిన. నల్లగొండకు జరిగిన అన్యాయం మీద ఆ రోజు ఏ పార్టీ నాయకుడన్న నోరు తెరిసిండా?
ఒక ఉదాహరణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎక్కడ కట్టవల్సింది.. ఏలేశ్వరం గ్రామం దగ్గర. కుట్రలు చేసి, నీళ్ల వాటాలు తగ్గించి 19 కిలోమీటర్లు కిందికి తెచ్చిన్రు. ఆ నాడు జరిగింది వంచన. ఏలేశ్వరం దగ్గర డ్యామ్ కట్టి ఉంటే ఇయ్యాల ఎత్తిపోతల పథకాలు అవసరమయ్యేవి కాదు. ఆ మోసానికి మూగ నోము వహించి, సాక్ష్యంగా ఉన్నది కాంగ్రెస్ నేతలు కాదా?
నేస్తానికి నివాళి
ఈ సభలో నా మిత్రుడు, గతంలో అనేక ఉద్యమాలు చేసిన నోముల నర్సింహయ్య ఈ రోజు నా పక్కన లేకపోవడం బాధగా ఉంది.
ఒక హెచ్చరిక
నిన్నమొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నరు. బీజేపీ వాళ్లు కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరు. వేరేవాళ్ల సభ కాడికి వచ్చి వీరంగం చేస్తమంటే ఎవరూ హర్షించరు. ప్రజలే బుద్ధి చెప్తరు. మేం తల్చుకుంటే మీరు నశమైపోతరు. దుమ్ముదుమ్మయితరు. ఇంక గూడ మాకు ముల్లు ఎక్కువ ఉన్నదంటే జనం పొల్లు పొల్లు చేస్తరు. పిచ్చి పనులు బంద్ చేసుకుంటే మంచిది.
ప్రగతి పథం గంధమల్ల, బస్వాపూర్
రిజర్వాయర్లను పూర్తి చేసి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు, డిండి ద్వారా నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే తెలంగాణలోనే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి నల్లగొండ జిల్లా నుంచే జరుగుతుంది. యాదాద్రి దివ్యక్షేత్ర ప్రపంచమే అబ్బురపడేలా రూపుదిద్దుకుంటున్నది.
తాజావార్తలు
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!