గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 11, 2021 , 01:34:11

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల  పోస్టర్‌ ఆవిష్కరణ

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 10 : ఈ నెల 19 నుంచి 24 వరకు జరుగనున్న  చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల వాల్‌ పోస్టర్‌ను మండలకేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమం లో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, రేగట్టె మలికార్జున్‌రెడ్డి, ఆలయ చైర్‌పర్సన్‌ మేకల అరుణారాజిరెడ్డి, సర్పంచ్‌  బాలకృష్ణ,  పాల్గొన్నారు.

VIDEOS

logo