ఇక లక్షణంగా సాగు

నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల 10న ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న లిఫ్టుల ద్వారా సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో 1.30లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఇన్నిరోజులు సాగునీరందక ఇబ్బందిపడిన రైతుల కష్టాలు తీరనున్నాయి. ముఖ్యమంత్రి నిర్ణయంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- మిర్యాలగూడ/ హాలియా/ దేవరకొండ/ హుజూర్నగర్/ కోదాడ
- ఎత్తిపోతల పథకం పేరు : ఏకేబీఆర్ లిఫ్టు(అంగడిపేట సమీపంలో)
- ఆయకట్టు : 4100 ఎకరాలు
- ఎక్కడ నుంచి ఎక్కడి కంటే : ఏకేబీఆర్ నుంచి పాల్వాయి వరకు..
- కొత్త లిఫ్టుల ఏర్పాటుతో
- 1.30 లక్షల ఎకరాలకు నీళ్లు
- సీఎం కేసీఆర్ ప్రకటనతో
- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
- ఎత్తిపోతల పథకాలతో బీడు భూములు సస్యశ్యామలం
మాకు చుట్టూ నీరున్నా ఉపయోగం లేకుండా పోయింది. మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఎత్తిపోతల పథకాల ఏర్పాటు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్ సారు లిఫ్టును మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. వాడపల్లి ఎత్తిపోతల పూర్తయితే మా భూములన్నీ సస్యశ్యామలం అవుతాయి. రెండు కార్లకు నీరందుతుంది.
- పగిడి కొండల్, రైతు, దామరచర్ల
మా కష్టాలు తీరినట్టే..
చివరి ఆయకట్టు భూములకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ. 817.50 కోట్లతో వెల్లటూరు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడం హర్షణీయం. ఇన్ని రోజులు సాగర్ ఎడమ కాల్వ ద్వారా మాకు సక్రమంగా నీరు అందక ఇబ్బందులు పడ్డాం. లిఫ్టు ఏర్పాటుతో రైతుల సాగునీటి కష్టాలు తీరినట్లే. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
- వాంకుడోతు రామారావు, ఎర్రకుంట తండా, హుజూర్నగర్
ఎత్తిపోతల పథకం పేరు : ఆర్-9(రామాపురం, నడిగూడెం మండలం)
ఆయకట్టు : 3వేల ఎకరాలు
ఎక్కడ : నడిగూడెం మండలం రామాపురం నుంచి మునగాల మండలం ఆకుపాముల వరకు(సాగర్ ఎడమ కాల్వ నుంచి 120 కిలోమీటర్ల వరకు)
కేసీఆర్ సార్ పుణ్యమే..
లిఫ్టుల ద్వారా మాకు నీరందితే మంచి పంటలు పండిస్తాం. మా దగ్గరే నీళ్లున్నా మా పొలాలకు వస్తలేవు. సీఎం కేసీఆర్ చలువతో మా దగ్గర లిఫ్టు ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి మా పొలాలకు సాగునీరు అందనుందని తెలిసి సంతోషంగా ఉంది.
- బొమ్ము కృష్ణయ్య, రైతు, రేకులగడ్డ, దేవరకొండ
3వేల ఎకరాలు సాగులోకి..
14 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్-9 ఎత్తిపోతల పథకానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చొరవతో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనుండడం సంతోషకరమైన విషయం. ఈ లిఫ్టు ద్వారా మునగాల నడిగూడెం మండలాల్లోని 8 గ్రామాలకు సాగునీరు అందుతుంది. బీడు భూములు సాగులోకి వస్తాయి. సీఎం కేసీఆర్‌కు రైతుల తరఫున ధన్యవాదాలు.
- నలమాద రామారావు, మాజీ ఎంపీటీసీ, తెల్లబెల్లి, నడిగూడెం
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం
మా ఊరి పక్కనే సాగర్ ఉన్నా మా భూములకు సాగునీరు అందడం లేదు. సీఎం కేసీఆర్ చొరవతో డిస్ట్రిబ్యూటరీ 8,9 కాల్వలకు సాగర్ లోలెవల్ కెనాల్ నుంచి మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడంతో మా కష్టాలు తీరినై. కాంగ్రెస్ పాలకులు మా కష్టాలు పట్టించుకోలేదు. మాకు సాగునీరు అందించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-రమావత్ లాల్‌సింగ్, పూల్యాతండా, పెద్దవూర
దశాబ్దాల కల నెరవేరింది
గుండెబోయన గూడెం, నర్లింగులగూడెం మధ్య లిఫ్టు ఏర్పాటు చేయనుండడంతో దశాబ్దాల నాటి రైతుల కల నెరవేరింది. కృష్ణమ్మ చెంతనే ఉన్నా ఆయా గ్రామాల రైతులకు సాగునీరందక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. లిఫ్టు పూర్తయి అందుబాటులోకి వస్తే పాలకవీడు మండలంలో వేలాది ఎకరాలు సస్యశ్యామలమవుతాయి.
- మలికంటి దర్గారావు, రైతుబంధు జిల్లాకమిటీ సభ్యుడు, హుజూర్నగర్
ఆనందంగా ఉంది
ప్రభుత్వం నెల్లికల్లు లిఫ్టు మంజురు చేసినందుకు ఆనందంగా ఉంది. 50 ఏళ్లుగా సాగునీరు లేక అల్లాడినం. ఇన్నాళ్లు కాంగ్రెస్ నాయకులు మా గోస పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ సారు మా ఇబ్బందులు తీరుస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా ప్రాంత రైతులందరూ సీఎం కేసీఆర్‌కు, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు జీవితాంతం రుణపడి ఉంటారు.
-రమావత్ పాండూనాయక్, ఎర్రచెరువుతండా, తిరుమలగిరి సాగర్
ఎత్తిపోతల పథకం పేరు : బాల్నేపల్లి (చాంప్లాతండా, అడవిదేవులపల్లి మండలం)
ఆయకట్టు :12,610 ఎకరాలు
ఎక్కడ : చిట్యాల నుంచి చాంప్లాతండా వరకు
ఎత్తిపోతల పథకం పేరు : గవ్వల సరి(చందంపేట మండలం)
ఆయకట్టు : 1119 ఎకరాలు
ఎక్కడ : పొగిళ్ల నుంచి సమీప ప్రాంతం వరకు
ఎత్తిపోతల పథకం పేరు : నెల్లికల్లు
ఆయకట్టు : 4174 ఎకరాలు
ఎక్కడ : సాగర్ జలాశయం నుంచి (నెల్లికల్లు అడ్డరోడ్డు) జాల్‌తండా వరకు
ఎత్తిపోతల పథకం పేరు : జాన్‌పహాడ్
(గుండెబోయినగూడెం వద్ద)
ఆయకట్టు : 5వేల ఎకరాలు
ఎక్కడ : గుండెబోయినగూడెం వద్ద కృష్ణానది నుంచి జాన్‌పహాడ్ వద్ద ఎల్- 14 మైనర్ వరకు
ఎత్తిపోతల పథకం పేరు : అంబాభవాని (వైజాక్ కాలనీ, నేరేడుగొమ్ము మండలం)
ఆయకట్టు : 13088 ఎకరాలు
ఎక్కడ : వైజాగ్‌కాలనీ నుంచి బుగ్గతండా వరకు..
ఎత్తిపోతల పథకం పేరు : అడ్డగట్టు (చందంపేట మండలం కంబాలపల్లి)
ఆయకట్టు : 8244 ఎకరాలు
ఎక్కడ : కంబాలపల్లి నుంచి
రేకులగడ్డ వరకు
ఎత్తిపోతల పథకం పేరు : కేశవాపురం(కొండ్రపోల్, దామరచర్ల మండలం)
ఆయకట్టు : 5875 ఎకరాలు
ఎక్కడ : కేశవాపురం పరిధిలోని లావూరితండా నుంచి కొండ్రపోల్ పరిధిలోని దున్నపోతుల గండి వరకు
ఎత్తిపోతల పథకం పేరు : పెద్దగట్టు (సంబాపూర్, పీఏపల్లి మండలం)
ఆయకట్టు : 4100 ఎకరాలు
ఎక్కడ : నంబాపూర్ నుంచి ఎల్లాపురం వరకు
ప్రతిపాదిత స్థలం
ఎత్తిపోతల పథకం పేరు : బొత్తలపాలెం(వాడపల్లి, దామరచర్ల మండలం)
ఆయకట్టు : 10వేల ఎకరాలు
ఎక్కడ : తాళ్లవీరప్పగూడెం వద్ద కృష్ణానది నుంచి బొత్తలపాలెం వరకు
పథకం పేరు : డీ-8, 9
ఆయకట్టు : 3వేల ఎకరాలు
ఎక్కడ : పెద్దవూర మండలం పూల్యాతండా నుంచి తిరుమలగిరి(సాగర్) మండలం రంగుండ్ల, ఎల్లాపురం వరకు
ఎత్తిపోతల పథకం పేరు : వెల్లటూరు(వెల్లటూరు కృష్ణానది వద్ద)
ఆయకట్టు : 60వేల ఎకరాలు
ఎక్కడ : వెల్లటూరు వద్ద కృష్ణానది నుంచి హుజూర్నగర్ మండలం వేపలసింగారం వద్ద ఉన్న ఎన్ఎస్పీ కాల్వలోకి..
తాజావార్తలు
- కేంద్రానికి తమిళ సంస్కృతిపై గౌరవం లేదు: రాహుల్‌గాంధీ
- ఎయిర్పోర్ట్ లాంజ్‌లో బైఠాయించిన చంద్రబాబు.. వీడియో
- అవును.. ఐపీఎల్‌కు మేం రెడీగా ఉన్నాం: అజారుద్దీన్
- ఆనంద్ దేవరకొండ మూడో సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
- కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఈటల
- మోదీకి టీకా ఇచ్చిన నర్సు ఏమన్నారంటే..
- వీడియో : ఒకే రోజు 3,229 పెండ్లిండ్లు
- పూరీ తనయుడు మరింత రొమాంటిక్‌గా ఉన్నాడే..!
- ఎమ్మెల్సీ ప్రచారంలో దూసుకుపోతున్న సురభి వాణీదేవి
- కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్