రెండో విడుత వ్యాక్సినేషన్ షురూ

- పోలీస్, రెవెన్యూ
- సిబ్బందికి, పారిశుధ్య
- కార్మికులకు కొవిడ్‌టీకా
- నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 971మందికి కొవిడ్ టీకా
నీలగిరి, ఫిబ్రవరి 6 : పోలీస్‌శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ విధిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని డీఐజీ రంగనాథ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్(పోలీస్, రెవెన్యూ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులు)కు కరోనా వ్యాక్సినేషన్ శనివారం ప్రారంభమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్క అర్బన్ హెల్త్‌సెంటర్‌లో డీఐజీ రంగనాథ్, డీఎంహెచ్ఓ డా.కొండల్రావు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఎలాంటి భయం లేకుండా పోలీస్‌శాఖలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ను అంతం చేయడం తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం కావడం హర్షణీయమని పేర్కొన్నారు. అనంతరం ఏఎస్పీలు నర్మద, సతీశ్, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ సురేశ్‌కుమార్, ఎస్బీ డీఎస్పీ రమణారెడ్డి, డీసీఆర్బీ సీఐ రవీందర్, కోర్టు లైజనింగ్ అధికారి శ్రీనివాస్ సీఐలు, ఎస్ఐలు వ్యాక్సిన్ వేయించుకున్నారు. కార్యక్రమంలో మాన్యంచెల్క అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ఎండీ రఫీ, సూపర్వైజర్ ఉపేంద్ర, సిబ్బంది నళిని, ఫార్మాసిస్ట్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు 971మందికి...
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో తొలిరోజు 971మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 30కేంద్రాల్లో 2328మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా 501మంది మాత్రమే తీసుకున్నారు. వీరిలో పోలీస్ సిబ్బంది 326, పారిశుధ్య కార్మికులు 85, రెవెన్యూ అధికారులు 90మంది ఉన్నారు. సూర్యాపేట జిల్లాలోని పది కేంద్రాల్లో 470మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ సూచించారు. శనివారం చివ్వెంల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఐ లోకేశ్, డాక్టర్ విజయ్‌సారథి, సూపర్వైజర్లు శేషయ్య, శిరోమణి, ఇందిర, సునీత తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎన్నికల రోజును సెలవుదినంగా భావించొద్దు: మంత్రి కేటీఆర్
- తెలంగాణ టూరిజం అంబాసిడర్‌గా బిగ్‌బాస్ హారిక
- బెంగాల్ పోరు : ఐదుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై..దీదీ పార్టీకి ఎదురుదెబ్బ!
- జీలపల్లిలో వడదెబ్బతో వ్యక్తి మృతి
- 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఘనంగా నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
- స్వచ్ఛంద ఈపీఎఫ్‌వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్‌తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ఎన్ఐఏకు.. ముఖేష్ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం కేసు దర్యాప్తు