ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 07, 2021 , 00:31:17

ముఖ్యమంత్రికి ధన్యవాదాలతో..

ముఖ్యమంత్రికి ధన్యవాదాలతో..

కొత్త లిఫ్ట్‌లతో లక్షా 30వేల ఎకరాలు సాగులోకి.. ఏకేబీఆర్‌ పెద్దగట్టు పూల్యాతండా (వరద కాల్వపై) వైజాగ్‌కాలనీ అడ్డగట్టు పొగిళ్ల నాగార్జునసాగర్‌ జలాశయం ప్రతిపాదిత ఎత్తిపోతల స్వరూపమిది.. నెల్లికల్లు బాల్నేపల్లి లావూడితండా (మూసీ మీద) తాళ్లవీరప్పగూడెం బొత్తలపాలెం జాన్‌పహాడ్‌

  • 14వ మైలురాయి వద్ద సీఎం బహిరంగ సభకు 
  • విస్తృత ఏర్పాట్లుఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలివచ్చేందుకు 
  • రైతాంగం సన్నద్ధం లక్షల్లో హాజరుకావచ్చని 
  • టీఆర్‌ఎస్‌ శ్రేణుల అంచనా
  • ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య నేతలు, 
  • అధికారులతో కలిసి 3 చోట్ల స్థల పరిశీలన
  • సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి నల్లగొండ జిల్లా... స్వరాష్ట్రంలో సగర్వంగా 

నిలదొక్కుకుంటున్నది. దశాబ్దాలపాటు గోసపడ్డ సూర్యాపేట, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు ప్రాంతాలు గోదావరి నీళ్లతో సస్యశ్యామలం అవుతుండగా.. నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో చివరి భూముల్లో కృష్ణా జలాలను పరవళ్లు తొక్కించేందుకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా 3 వేల కోట్ల రూపాయలతో 13 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారు. ఏండ్ల నాటి నిర్లక్ష్యానికి కరువు ప్రాంతాలుగా ముద్రపడ్డ మునుగోడు, దేవరకొండనూ డిండి ఎత్తిపోతలతో చక్కదిద్దేందుకు కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు కృతజ్ఞతగా ధన్యవాద సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 10నాటి ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు మొదలుపెట్టాయి. లక్షలాది మంది తరలివస్తారన్న అంచనాలతో హాలియా సమీపంలోని 14వ మైలురాయి వద్ద సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాయి. పార్టీ నేతలు, అధికారులతో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం సభాస్థలంతోపాటు నెల్లికల్లు వద్ద ఎత్తిపోతల శంకుస్థాపన ప్రదేశాన్ని, సాగర్‌లో హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. ఉమ్మడి జిల్లా ప్రజల తరుఫున ధన్యవాద సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.

 క్షీరాభిషేకం.. 

సాగర్‌ ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు ఎత్తిపోతల పథకాలు, మేజర్ల ఆధునీకరణకు నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం పలుచోట్ల సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి పెద్దఎత్తున క్షీరాభిషేకాలు చేశారు. హుజూర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.

ఇక లక్షణంగా సాగు

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ)/హాలియా/ నందికొండ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పార్టీ నేతలు విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్‌ హెలిక్యాప్టర్‌ ద్వారా హైదారాబాద్‌ నుంచి నేరుగా నాగార్జునసాగర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నెల్లికల్లు గ్రామానికి చేరుకుని లిప్టు పథకాలన్నింటికీ అక్కడే శంకుస్థాపన చేస్తారు. తర్వాత సాగర్‌కు చేరుకుని అక్కడి నుంచి తిరిగి హెలిక్యాప్టర్‌లో 14వ మైలురాయి సమీపంలోని స్థభాస్థలికి కేసీఆర్‌ రానున్నారు. అయితే వివిధ రంగాల్లో జిల్లా అగ్రగామిగా నిలువడంలో సీఏం కేసీఆర్‌ అందిస్తున్న సంపూర్ణ సహకారానికి ధన్యవాదాలు తెలిపేలా సభ జరపాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు సభకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తరలిరానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, మందుల సామేల్‌, పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సోమా భరత్‌కుమార్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌, స్థానిక అధికారులు, నేతలతో కలిసి పర్యటన ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించారు. మంత్రి వెంట నందికొండ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ కర్న అనూషారెడ్డి, కమిషనర్‌ పల్లారావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కర్న బ్రహ్మానందరెడ్డి, కౌన్సిలర్లు నిమ్మల ఇందిర, రమేశ్‌జీ, మంగ్తా, ఎన్నెస్పీ ఎస్‌ఈ ధర్మానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

14వ మైలురాయి సమీపంలో సభ...

సీఎం పర్యటన నేపథ్యంలో నెల్లికల్లులో లిఫ్టు పథకాల శంకుస్థాపన స్థలాన్ని, సాగర్‌ బీసీ రెసిడెన్షియల్‌ హాస్టల్‌లో హెలీప్యాడ్‌ స్థలాన్ని, 14వ మైలురాయి సమీపంలో నల్లగొండ రోడ్డులో విశాలమైన స్థలాన్ని పరిశీలించారు. దేవరకొండ, సాగర్‌ నియోజకవర్గ ప్రజలు హాలియా మీదుగా, కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు నిడమనూర్‌ మీదుగా, ఆలేరు, భువనగిరి, నకిరేకల్‌, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజలు నల్లగొండ మీదుగా చేరుకునేలా అనువైన స్థలాన్ని గుర్తించారు. కేవలం సభాస్థలి కోసమే 50నుంచి 60ఎకరాలు, పార్కింగ్‌, హెలీప్యాడ్‌ కోసం మరో 250నుంచి 300ఎకరాల వరకు స్థలం అవసరం ఉండొచ్చని భావిస్తున్నారు. వీఐపీ పార్కింగ్‌తో పాటు సభకు అవసరమైన స్థలాన్ని శనివారం సాయంత్రం నుంచే చదును చేస్తున్నారు. ఒకటీ రెండ్రోజుల్లో పూర్తిగా చదును చేసి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం సభాస్థలికి వచ్చే సరికే ప్రజలంతా అక్కడికి చేరుకునేలా చూడాలని భావిస్తున్నారు. సభ నిర్వహణ, ఏర్పాట్లు, జనం తరలింపునకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం ఉదయం జిల్లా ముఖ్యులతోనూ ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలిసింది. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచీ ప్రజలు తరలివచ్చేలా జాగ్రత్త వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ ఆరున్నరేండ్లలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కృష్ణాజలాల్లో నిక్కచ్చిగా మన వాటా వాడుకున్న విధానం, సాగర్‌ ఆయకట్టులో ఇప్పటికే ఉన్న లిఫ్టుల నిర్వహణ, కొత్త లిఫ్టుల మంజూరు, డిండి ఎత్తిపోతల లాంటి పథకాల నిర్మాణం, నీటి తీరువా రద్దు, 24గంటల ఉచిత విద్యుత్‌, మిషన్‌ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికీ రక్షిత జలాల సరఫరా, రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో వ్యవసాయంలోని పంటల సాగులో, దిగుబడిలోనూ రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. వీటికి తోడు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో సమైక్య పాలనలో వెనుకబడ్డ జిల్లాగా ముద్ర పడిన ఉమ్మడి నల్లగొండను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పేందుకు జిల్లా ప్రజలు సమాయత్తం అవుతున్నారు. అందుకే ఈ సభను ధన్యవాద సభగా నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ సభకు లక్షలాదిగా తరలివచ్చేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఈ నెల 10న మధ్యాహ్నం 12.30గంటలకు నెల్లికల్లులో లిప్టులకు శంకుస్థాపన చేస్తారని, 2గంటలకు 14వ మైలురాయి సమీపంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగసభలో జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు.

VIDEOS

logo