ఊరెంత మారిందో..!

- పగతి పలుకరించగ..
- ‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామాల రూపురేఖలు
- 17 నెలలుగా పల్లెలకు నిధుల వరద
- నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు రూ.544కోట్లు
- ప్రతి ఊరుకూ అదనంగా రూ.40-60లక్షలు
- ఎటుచూసినా స్వచ్ఛత.. పచ్చదనం
- శాశ్వత వనరులను సమకూర్చుకుంటున్న పల్లెలు
- ఉత్తమ పంచాయతీలుగా అవార్డులు
- ‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామాల రూపురేఖలు
- 17 నెలలుగా పల్లెలకు నిధుల వరద
- నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు రూ.544కోట్లు
- ప్రతి ఊరుకూ అదనంగా రూ.40-60లక్షలు
- ఎటుచూసినా స్వచ్ఛత.. పచ్చదనం
- శాశ్వత వనరులను సమకూర్చుకుంటున్న పల్లెలు
- ఉత్తమ పంచాయతీలుగా అవార్డులు
- పల్లె ప్రగతి ద్వారా నెలనెలా వస్తున్న నిధులు
- నల్లగొండ జిల్లాకు 20కోట్లు
- సూర్యాపేట జిల్లాకు 12 కోట్లు
- ఏండ్లకేండ్లు నిధుల్లేక నీరసించిన పల్లెలు నేడు సర్కారు సంకల్పంతో శాశ్వత వనరులను సమకూర్చుకుంటున్నాయి. ఒకనాటి ఖాళీ ఖజానాల్లోకి నెలనెలా నిధులు పారుతుండగా సరికొత్త శోభను సంతరించు కుంటున్నాయి. అభివృద్ధిలో పోటీ పడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.గతంలో ఊరంటే గతుకుల రోడ్లు, వేలాడే విద్యుత్ తీగలు, వెలుగని వీధి లైట్లు, కంపుకొట్టే మురుగు కాల్వలు, పాడుపడ్డ బావులు, పడావుపడ్డ ఇండ్లు, ఆరడుగుల జాగా లేని వారికి అంతిమ సంస్కారమంటే అది చావుకు మించిన సమస్యగా ఉండేది. నల్లా బిల్లులు, ఇంటి పన్నులు మినహా అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులంటూ ఉండేవి కాదు.
సరిగ్గా 17 నెలల కింద మొదలైన పల్లె ప్రగతి
విప్లవాత్మక మార్పులతో గ్రామాల స్వరూపాన్నే మార్చేస్తున్నది. ఈ ఏడాదిన్నరలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.544కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు ఏ బజారు చూసినా సీసీ రోడ్డే. ఏ రోడ్డు వెంట చూసినా మొక్కలే.. డ్రైనేజీల్లో మురుగు లేదు. సీజనల్ వ్యాధులూ రావట్లేవు. ఇంకా.. పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, ట్రాక్టర్లు, ట్యాంకర్ల వంటివెన్నో సమకూర్చుకుని పల్లెలు.. గ్రామ స్వరాజ్యం దిశగా
అడుగులు వేస్తున్నాయి.
ప్రతి ఎన్నికల్లోనూ పల్లెల గురించే వల్లించే పాలకులు ఆ పల్లెల అభివృద్ధికి పెద్దగా నిధులు కేటాయించిన సందర్భాల్లేవు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పల్లె దశ మారిపోయింది. ‘తెలంగాణ పల్లె ప్రగతి’ పేరుతో నేడు అన్ని గ్రామాల్లో పురోగతి నెలకొన్నది. 17నెలల కాలంలోనే గణనీయమైన ప్రగతి సాకారమైంది. 2019 సెప్టెంబర్‌లో పల్లె ప్రగతి ప్రారంభమైంది. 2011జనాభా లెక్కల ప్రకారం ప్రతి మనిషికి నెలకు రూ.187చొప్పున నల్లగొండ జిల్లాలో జనాభా ఆధారంగా 844గ్రామ పంచాయతీలకు నెలకు రూ.20కోట్లు, సూర్యాపేట జిల్లాలోని 475గ్రామ పంచాయతీలకు రూ.12కోట్ల చొప్పున ఈ ఏడాది జనవరి వరకు రూ. 544కోట్ల నిధులు విడుదలయ్యా యి. ఇవేకాకుండా ఇతర నిధులు కలిపి ఈ 17నెలల కాలంలో ఒక్కో గ్రామానికి రూ.40-60లక్షలు మంజూరయ్యా యి. అనతి కాలంలోనే అభివృద్ధి సాధించిన పల్లెలను మండలానికి మూడు చొప్పున ఎంపిక చేసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులను అందించారు.
పచ్చదనం దిశగా ..
గ్రామాల్లో పచ్చదనం వికసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసింది. ప్రతి నర్సరీలో కనీసం పది వేల మొక్కలు పెంచాలని నిబంధన పెట్టిన సర్కారు.. అందుకుగాను రూ.2లక్షలు కేటాయించింది. మొక్కల పెంపకంతో పాటు ఏడాది పొడవునా నీరందించేలా ట్రాక్టర్ ట్యాంకర్ కేటాయించింది. ట్రీ గార్డులు సైతం తప్పనిసరి చేసి మొక్కల సంరక్షణ బాధ్యతను అధికారులకు అప్పగించింది. 80శాతం మొక్కలు బతుకకపోతే అధికార యంత్రాంగానికి నోటీసులు ఇస్తున్నది. మరోవైపు అవెన్యూ ప్లాంటేషన్ కింద పెద్దఎత్తున మొక్కలు నాటడం, ఖాళీ స్థలాల్లో మంకీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయిస్తున్నది.
ఊరికో డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్..
డంపింగ్ యార్డులో పోసిన చెత్త వల్ల పర్యావరణానికి హాని కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రతి యార్డులో సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణానికి ఆదేశించింది. రూ.2.50లక్షల వ్యయంతో వీటిని నిర్మించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో సెగ్రిగేషన్ షెడ్లలో ఎరువులు తయారు చేయాలని సర్కారు భావిస్తున్నది.
వైకుంఠ ధామాల నిర్మాణం..
ప్రతి గ్రామంలోనూ శ్మశాన వాటిక ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.12.60లక్షల వ్యయంతో చేపట్టిన పనులు దాదాపు అన్ని గ్రామాల్లో పూర్తికావచ్చాయి.
ప్రకృతి వనాలు..
పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాల నిర్మాణం జరుగుతున్నది. అర ఎకరం మొదలు ఎకరం విస్తీర్ణంలో మొక్కలు పెంచుతున్నది. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పూల మొక్కలు నాటిస్తున్నది. పార్కు, వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నది.
కార్మికుల వేతనాలు పెంపు..
పంచాయతీ కార్మికుల కష్టాలు తెలిసిన సర్కారు వారికి వేతనాలు పెంచి భరోసా కల్పించింది. ఏడేండ్లుగా కేవలం రూ.1500వేతనంపై పనిచేస్తుండగా.. ఒకేసారి రూ.8500కు పెంచింది. ఇంటింటా చెత్త సేకరణ చేయాలని పురమాయించి ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేసింది. ఈ బుట్టల ద్వారా చెత్తను సేకరిస్తున్న పంచాయతీ కార్మికులు పారిశుధ్య సమస్యను పరిష్కరిస్తున్నారు.
ప్రతి పంచాయతీకి ట్రాక్టర్..
వీధుల్లో పేరుకున్న చెత్తను తరలించడానికి ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ను అందించింది. ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలుకు రూ.10లక్షలు కేటాయించింది. పల్లె ప్రగతి నిధి నుంచి వాయిదా పద్ధతిపై కంపెనీలకు చెల్లించేలా ఒప్పందాన్ని కుదిర్చింది. ప్రస్తుతం ఆ ట్రాక్టర్లతో చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు.
ఇంటికో ఇంకుడు గుంత..
ఇండ్లలో నుంచి వచ్చే మురుగు నీరు వీధుల్లో ప్రవహించకుండా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టింది. రూ.6వేలు అందిస్తూ ప్రజలను ప్రోత్సహిస్తున్నది. ఈ మేరకు అధికారులు ఇం టింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. కళాజాత బృందాల ద్వారా ప్రదర్శనలు ఇస్తున్నారు.
పంట కల్లాల నిర్మాణం..
రైతులు పంటను ఆరబెట్టుకోవడానికి అనువైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పంట కల్లాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నది. ప్రతి గ్రామ పంచాయతీకి గరిష్ఠంగా పది మందికి అవకాశం కల్పించింది. ప్రస్తుతం జిల్లా లో పంట కల్లాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది.
రైతు వేదికల నిర్మాణం..
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న సర్కారు రైతు వేదికల నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసింది. వ్యవసాయాధికారులతో రైతులు సమావేశమై చర్చించేలా నిర్మించిన రైతు వేదికలు ఇటీవల ప్రారంభమయ్యాయి. క్లస్టర్‌కు ఒక వేదిక నిర్మాణానికి రూ.22.50లక్షలు కేటాయించి నల్లగొండ జిల్లాలో 140, సూర్యాపేట జిల్లాలో 112వేదికలను పూర్తిచేసింది.
పారిశుధ్యానికి పెద్దపీట..
పల్లె ప్రగతిలో పారిశుధ్యానికి పెద్దపీట వేశారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి 2019సెప్టెంబర్ 6నుంచి అక్టోబర్ 5వరకు, రెండో విడుత 2020జనవరి 2నుంచి 11వరకు పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో చెత్తకుప్పలు తొలగించారు. డ్రైనేజీలు పరిశుభ్రం చేశారు. వీధుల్లో చెత్త వేయకుండా కుండీలు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించారు.
తాజావార్తలు
- పల్లె, పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
- కాంగ్రెస్‌లో చేరిన నాథురాం గాడ్సే భక్తుడు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురుతో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?