ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 02, 2021 , 00:39:20

క్రీడలతో యువతలో ఐకమత్యం

క్రీడలతో యువతలో ఐకమత్యం

గుర్రంపోడు, ఫిబ్రవరి1 : క్రీడలతో యువతలో ఐకమత్యం ఏర్పడుతుందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్‌రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని ఉట్లపల్లి గ్రా మంలో పాశం అలివేలమ్మా గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి,  సర్పంచులు షేక్‌ మస్రత్‌సయ్యద్‌మియా, షేక్‌ షాహిన్‌మదార్ష, కేసాని యాదగిరిరెడ్డి, చాడ చక్రవర్తి, దుండిగళ్ల పద్మావెంకటేశ్వర్లు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. 

మైలాపురంలో..

మైలాపురంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్‌ పోటీలను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఎంసీ కోటిరెడ్డి ప్రారంభించారు. కార్య క్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ బల్గూరి నగేశ్‌గౌడ్‌, నాయకులు గుండెబోయిన కిరణ్‌, రావులపాటి భాస్కర్‌, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

VIDEOS

logo