శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 01, 2021 , 01:14:56

మంగళపల్లి వాగుపై చెక్‌డ్యామ్‌

మంగళపల్లి వాగుపై చెక్‌డ్యామ్‌

  • శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే లింగయ్య

కట్టంగూర్‌(నకిరేకల్‌)/ చిట్యాల/ నార్కట్‌పల్లి, జనవరి 31 : చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని మంగళపల్లి గ్రామంలోని పెద్దవాగుపై రూ.3.5కోట్ల నాబార్డు నిధులతో చేపట్టే చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో వృథాగా పోతున్న నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడి భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. రైతుల జీవితాల్లో జలసిరులు నింపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. కాంట్రాక్టర్లు నాణ్యతగా నిర్మించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నడికుడి ఉమారాణి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ నవీన్‌రావు, నడికుడి వెంకటేశ్వర్లు, మాద నగేశ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు పాపయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా చిట్యాల మండలం వెల్మినేడు సింగిల్‌ ఆధ్వర్యంలో ఐఓసీ సహకారంతో నిర్వహించనున్న పెట్రోలు బంక్‌కు ఎమ్మెల్యే చిరుమర్తి శంకుస్థాపన చేశారు. ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్‌, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రుద్రారం భిక్షం, సర్పంచు మల్లమ్మ, ఎంపీటీసీలు  పాల్గొన్నారు. వెల్మినేడులోని ఎంపీఎల్‌ ఐరన్‌ కంపెనీ వారు లోడింగ్‌లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ లారీ ఓనర్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ బాధ్యులు ఎస్‌.రాంరెడ్డి, జె. లింగస్వామి ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. 

ఆంజనేయస్వామి విగ్రహావిష్కరణ

నార్కట్‌పల్లి మండలంలోని షాపల్లి గ్రామంలో జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కమలాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, సర్పంచ్‌ కర్నాటి ఉపేందర్‌, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీటీసీలు కనుకు అంజయ్య, పుల్లెంల ముత్తయ్య, ప్రజ్ఞాపురం రామకృష్ణ, రవి పాల్గొన్నారు.

VIDEOS

logo