శుక్రవారం 05 మార్చి 2021
Nalgonda - Feb 01, 2021 , 01:14:56

పలుకరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ..

పలుకరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ..

  • నల్లగొండలో ఎమ్మెల్సీ పల్లా సుడిగాలి పర్యటన
  • ఎన్జీ కళాశాలలో మార్నింగ్‌ వాకర్స్‌తో ముచ్చటింపు
  • ఆ తర్వాత వీఆర్వోలు, లెక్చరర్స్‌, 
  • ప్రైవేట్‌ టీచర్లతో సమావేశాలు
  • వీఆర్వోలు, లెక్చరర్స్‌, టీచర్లతో సమావేశం
  • టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో  ఆత్మీయ పరిచయం

నల్లగొండ, జనవరి 31: రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు. జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డితో కలిసి ఉదయం ఎన్జీ కళాశాలలో మార్నింగ్‌ వాకర్స్‌తో ముచ్చటించారు. అనంతరం పల్స్‌ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత టీఎన్జీవోస్‌ భవన్‌లో వీఆర్వోలు, లెక్చరర్స్‌ భవన్‌లో కాంట్రాక్ట్‌ లెక్చరర్లతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి వేంకటేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో కేజీ టు పీజీ విద్యాసంస్థల యజమానులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం ఎంఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. తాను పట్టభద్రుల గొంతుకనై మండలిలో వారి సమస్యలు ప్రస్తావించానని, మరోసారి అవకాశం ఇస్తే అంతకుమించి పనిచేస్తానని అన్నారు. రెవెన్యూశాఖలో పనిచేస్తున్న వీఆర్వోలకు పూర్వ వైభవం కల్పిస్తామన్నారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా కృషి చేస్తానని, ఉద్యోగుల విషయంలో సీఎం సానుకూలమైన దృక్పథంతో ఉన్నారన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, అబ్బగోని రమేశ్‌, టీజీవోస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస మూర్తి, జేఏసీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, గోలి అమరేందర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొర్ర సుధాకర్‌, టీఎన్జీఓస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్‌, జిల్లా అధ్యక్షుడు పగిల్ల వెంకటయ్య, కార్యదర్శి నజీర్‌, యాదాద్రి, సూర్యాపేట, జనగామ జిల్లాల అధ్యక్షులు అయిలయ్య, సంజీవ, శ్రీనివాసులు, కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌, ఉమ్మడి జిల్లాల అధ్యాపకులు నర్సిరెడ్డి, అన్సారి, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

VIDEOS

logo