మరింత మంది కఆసరా

ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించనున్నది. కరోనా కారణంగా ఆగిపోయిన పింఛన్లను మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఈసారి 57 ఏండ్లు నిండిన వారికి కూడా లబ్ధి చేకూర్చాలని భావిస్తున్నది. ఆ మేరకు జిల్లాల వారీగా జాబితాలు తీసుకున్నది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి 36,340మంది అర్హులు ఉన్నట్లు అధికారులు నివేదిక సమర్పించారు. నూతన పింఛన్ల మంజూరుకు సర్కారు సన్నాహాలు 57ఏండ్ల వయస్సు నిండిన వారి జాబితా సేకరణ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మరో 60వేల మంది! ప్రస్తుతం 3.06లక్షల మందికి పింఛన్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం మరింత మందికి ‘ఆసరా’ అందించనున్నది. ఇటీవల 57ఏండ్ల వయస్సు పైబడిన వారందరికీ పింఛన్ మంజూరు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అర్హుల జాబితా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అర్హత సాధించిన వారిలో నల్లగొండ జిల్లాలో 36,340మంది, సూర్యాపేట జిల్లాలో 24,573మంది ఉన్నారు. రెండు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 3.06లక్షల మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు.
నల్లగొండ, జనవరి 30 : వృద్ధులతో పాటు దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, వితంతువులకు ప్రతి నెలా సర్కారు ఆసరా పథకం ద్వారా పింఛన్లు అందిస్తున్నది. దివ్యాంగులకు రూ.3వేలు, ఇతరులకు రూ.2వేల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ప్రతి ఆర్నెళ్లకోసారి నూతన పింఛన్లు మంజూరు చేస్తుండగా కరోనా కారణంగా 2019ఆగస్టులో బ్రేక్ పడింది. ఈ ఏడాదిన్నరలో నూతన దరఖాస్తుల సంఖ్య భారీగానే పెరిగింది.
కొత్తగా 60,913మంది అర్హులు..
ఓటరు జాబితా ఆధారంగా నల్లగొండ జిల్లాలో 57ఏండ్లు పైబడిన వారు 32,780మంది, సూర్యాపేట జిల్లాలో 20,997మంది ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు లెక్కతేల్చారు. జాబితాను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించారు. వీరితో పాటు దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు నల్లగొండ జిల్లాలో 3,560మంది, సూర్యాపేట జిల్లాలో 3576మంది ఉన్నట్లు పేర్కొన్నారు.
వితంతు పింఛన్లే అధికం..
నల్లగొండ, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 3.06లక్షల మందికి (నల్లగొండ 1,79,301, సూర్యాపేట 1,27,246) ఆసరా పింఛన్ అందుతున్నది. అత్యధికంగా వితంతువుల సంఖ్య 1,27,882 కాగా, వృద్ధులు 1,01,223, దివ్యాంగులు 49,469, చేనేత కార్మికులు 3742, గీత కార్మికులు14,067, ఒంటరి మహిళలు 9164మంది ఉన్నారు. ఈ మేరకు నెలకు సుమారుగా రూ.66.73కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. నూతన పింఛన్ల మంజూరుతో పింఛన్ల సంఖ్య 3.67లక్షలకు పెరిగే అవకాశం ఉండగా.. మరో రూ.12.50కోట్లు ప్రభుత్వంపై భారం పడనున్నది.
జాబితా సేకరించి ప్రభుత్వానికి నివేదించాం...
జిల్లా వ్యాప్తంగా 57ఏండ్లు నిండిన వృద్ధులతో పాటు పలు విభాగాల పరిధిలో అర్హుల జాబితాను సేకరించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. ఏడాదిన్నరగా కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. త్వరలో అవి మంజూరయ్యే అవకాశం ఉన్నది.
- శేఖర్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి, నల్లగొండ
తాజావార్తలు
- పెట్రోల్‌పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్‌యూపీపీ, ఎస్‌ఎల్‌టీఏ సంఘాలు
- పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
- అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం యజమాని మృతి
- ఎవరీ పద్మశ్రీ.. దిల్ రాజు ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు..?
- రూ.43వేల దిగువకు బంగారం ధర..
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్‌కు రెడీ
- అందుకే పెద్ద సంఖ్యలో గురుకులాల స్థాపన
- .. ఆ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఉపసంహరణ
- ఒలింపిక్ జ్యోతిని చేపట్టనున్న శతాధిక వృద్ధురాలు!