సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Jan 31, 2021 , 00:49:36

హరితహారం మొక్కలను సంరక్షించాలి

హరితహారం మొక్కలను సంరక్షించాలి

  • జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి

గుర్రంపోడు/డిండి/దేవరకొండ రూరల్‌, జనవరి30: నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి అన్నారు. శనివారం గుర్రంపోడు, మండలంలోని కొప్పోలు, తానేదార్‌పల్లి, కాచారం, పాల్వాచి గ్రామాల్లో హరితహరంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. డిండి ప్రధాన రహదారి వెంట నాటిన మొక్కలను, సింగరాజుపల్లి, దేవరకొండ మండలంలోని ఎల్లారెడ్డిబావి, పడ్మట్‌పల్లి, తూర్పుపల్లి, వెంకట్‌తండా, సపావట్‌తండా, భీమనపల్లిలో పల్లెప్రకృతి వనం, డం పింగ్‌ యార్డు, శ్మశాన వాటికను పరిశీలించారు. అనంతరం గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.  హరి తహారం మొక్కలను ఆయన వెంట ఎంపీడీఓలు సుధాకర్‌, గిరిబాబు, ఏపీఓ శ్రీనివాస్‌, సర్పంచులు షేక్‌ మస్రత్‌సయ్యద్‌మియా, తిరుగుడు జ్యోతీలింగారెడ్డి, బొల్లు శ్రీనివాస్‌రెడ్డి, గట్టుపల్లి నిర్మలామణిపాల్‌రెడ్డి, పొనుగోటి రవీందర్‌రావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

VIDEOS

logo