సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Jan 31, 2021 , 00:49:34

సాగర్‌కు జానారెడ్డి చేసిందేమీ లేదు

సాగర్‌కు జానారెడ్డి చేసిందేమీ లేదు

  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నోముల భగత్‌

హాలియా, జనవరి 30 : సాగర్‌ నియోజకవర్గంలో అభివృద్ధి అంతా టీఆర్‌ఎస్‌ పాలనలోనే జరిగిందని, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు  జానారెడ్డి చేసిందేమీ లేదని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నోముల భగత్‌ అన్నారు. మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా మున్సిపాలిటీలో జిల్లాలో ఎక్కడా జరగని అభివృద్ధి  జరిగిందన్నారు. త్వరలో జరుగబోయే ఉపఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ నాయకులు రెండ్రోజుల క్రితం హాలియా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారని విమర్శించారు. పట్టణ ప్రగతిలో భాగంగా హాలియాలో హరితహారం కింద 5 వేల మొక్కలు నాటడంతో పాటు అన్ని వీధుల్లో ఎల్‌ఈడీ లైట్లు వేయించిన ఘనత టీఆర్‌ఎస్‌దే అన్నారు. హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సీఎం కేసీఆర్‌ మంజూరు చేయగా, మినీ స్టేడియం ఏర్పాటుకు భూమిపూజ చేస్తే కాంగ్రెస్‌ నాయకులే కోర్టులో అక్రమ కేసులు వేయించి అడ్డుపడ్డారన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంపటి పార్వతమ్మా శంకరయ్య, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ యడవల్లి విజయేందర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నల్లగొండ సుధాకర్‌, జిల్లా నాయకుడు యడవల్లి మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, అన్నెపాక శ్రీనివాస్‌, వర్రా వెంకట్‌రెడ్డి, ప్రసాద్‌ నాయక్‌, చాపల సైదులు, అన్వరొద్దీన్‌, రావుల లింగయ్య, చెరుపల్లి ముత్యాలు పాల్గొన్నారు.

VIDEOS

logo