ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 30, 2021 , 01:42:07

బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

  • ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

దేవరకొండ, జనవరి29 : అంగడిపేట సమీపంలో ఇటీవల జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి చికిత్సకు రూ.39.10 లక్షలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. ప్రమాదంలో గాయపడి దేవరకొండలో చికిత్స పొందుతున్న నర్సమ్మకు ఎమ్మెల్యే శుక్రవారం రూ.15 వేల ఆర్థికసాయం అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఒక్కో కుటుంబానికి రూ.1.10 లక్షలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, వైస్‌ చైర్మన్‌ రహత్‌ అలీ, నాయకులు నల్లగాసు జాన్‌యాదవ్‌, హన్మంతు వెంకటేశ్‌గౌడ్‌, వేముల రాజు, సర్పంచ్‌ నోముల మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo