సిగరేటు దందా

- కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో బ్లాక్ చేస్తున్న డీలర్లు
- ధరలు పెరుగుతాయని మూడొంతులు తగ్గించి
- మార్కెట్లో సిగరెట్ల ధరలకు రెక్కలు
- పొగరాయుళ్ల జేబుకు నిత్యం రూ.10లక్షలు చిల్లు
- పొగాకు ఉత్పత్తుల్లో ‘కింగ్'లాంటి సిగరెట్లు
- దారి మళ్లుతున్నాయి. కంపెనీలు, డీలర్లే అక్రమంగా
దాచేస్తున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటారా? బడ్జెట్ మహిమ! విలాస వస్తువుల జాబితాలోని సిగరెట్ల ధరలు ప్రతి బడ్జెట్లో పెరగడమే మామూలే. ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా.. ధరలు పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చని మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దాదాపు మూడొంతుల సరఫరా నిలిపివేయడంతో రిటైల్ అధిక ధరలకు అమ్ముతున్నారు.
నల్లగొండ, జనవరి 29 : ఉమ్మడి జిల్లాలో కొద్ది రోజుల నుంచి సిగరెట్ల బ్లాక్ దందా నడుస్తున్నది ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ నేపథ్యంలో కొన్ని కంపెనీలు, డీలర్లు సిగరెట్ల సరఫరా తగ్గించినట్లు రిటైల్ వ్యాపారులు చెబుతునారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లయ్ లేకుండా మార్కెట్లో సిగరెట్ల ధరలకూ రెక్కలొచ్చాయి. పాన్పాపులు, కిరాణ దుకాణాల్లో వీటిని ఎమ్మార్పీకి మించి విక్రయిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి ప్రధాన పట్టణాల్లో 600, మిగిలిన నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో మరో 400 దాకా పాన్‌షాపులు ఉనాయి. ప్రధాన పట్టణాల్లోని ఒక్కో షాపు రెగ్యులర్‌గా వివిధ కంపెనీల సిగరెట్లు అన్నీ కలిపి 20 నుంచి 30 డబ్బాలు విక్రయిస్తుండగా, మిగతా ప్రాంతాల్లో 10 నుంచి 15 డబ్బాల చొప్పున అమ్ముతుటాయి. మొత్తంగా చూస్తే, సుమారు 20వేల నుంచి 30వేల డబ్బాల సేల్స్ ఉంటాయి. కిరాణ దుకాణాల్లో మరో 30వేల నుంచి 50వేల దాకా విక్రయిస్తారు. పెద్దగోల్డ్ ఫ్లాక్ డబ్బా రూ.165 కాగా, అతి తక్కువగా చిన్న టిప్పర్ రూ.45. ఈ లెక్కన సగటున రోజూ సిగరెట్ల వ్యాపారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.70లక్షలకుపైనే జరుగుతుందని అంచనా. ప్రస్తుతం 10 నుంచి 20శాతం మేరకు అదనపు ధరలతో స్మోకర్స్పై రూ.10లక్షల దాకా అదనపు భారం పడుతున్నది.
మూడొంతుల సిగరెట్లు బ్లాక్..
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అందులో విలాస వస్తువైన పొగాకు ఉత్పత్తులపై ప్రతియేటా పన్ను పెరుగుతూనే ఉంటుంది. పైగా, ప్రస్తుత సంవత్సరం కరోనాతో కూడుకున్నది కావడంతో నిత్యావసరాలు మినహాయిస్తే ఇతర వాటిపై పెద్దగా తగ్గింపులు ఉండక పోవచ్చని వాపారులు భావిస్తున్నారు. దాంతో సిగరెట్ ఉత్పత్తిదారులు, డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మూడొంతుల సప్లయ్ తగ్గించి మార్కెట్‌కు ఒక్క వంతు మాత్రమే ఇస్తున్నారు. రెగ్యులర్‌గా ఒక్కో పాన్‌షాప్‌కు కనీసం 20 నుంచి 30 డబ్బాలు వేసేవారు ప్రస్తుతం 5 నుంచి 5 డబ్బాలు మించి వేయడం లేదు. కిరాణా షాపుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
పాత స్టాక్‌కు కొత్త లేబుల్స్!
యేటా కేంద్ర దృష్టిలో పెట్టుకొని సిగరెట్ కంపెనీల ప్రతినిధులు నెలపాటు ఉత్పత్తుల్లో 75 శాతం బ్లాక్ చేసి మిగిలినవి మార్కెట్‌కు సైప్లె చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లో ఆయా కంపెనీలకు చెందిన 12 నుంచి 15 రకాల సిగరెట్లు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రధానంగా ఓ బడా కంపెనీకి చెందిన సిగరెట్లతోపాటు ఇతర కంపెనీలకు చెందిన మరికొన్ని సిగరెట్లు బ్లాక్ అవుతున్నట్లు తెలుస్తున్నది. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా ప్రస్తుతం ఉన్న ధరలకు కనీసం 20శాతం పెరిగే అవకాశం ఉన్నదని, పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని పాత స్టాక్‌లకే కొత్త లేబుల్స్ అంటించి మార్కెట్లో అమ్ముతారని కొందరు వ్యాపారులు చెబుతుండడం గమనార్హం.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్