గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 29, 2021 , 00:59:19

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  • నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 

కట్టంగూర్‌, జనవరి28 : సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని పందనపల్లి ఉప సర్పంచ్‌ గంట ప్రవీణ్‌తో పాటు ఇద్దరు వార్డు సభ్యులు, 50 మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు గురువారం కట్టంగూర్‌లో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.  వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నూక సైదులు, సర్పంచులు వడ్డె సైదిరెడ్డి, గుర్రం సైదులు, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, దాసరి సంజయ్‌, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, జానీపాషా, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, ఉప సర్పంచ్‌ అంతటి శ్రీను, టీఆర్‌ఎస్‌ మండల, గ్రామశాఖ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండల్‌, బొల్లెద్దు యాదయ్య, ముప్పిడి యాదయ్య పాల్గొన్నారు. 


VIDEOS

logo