శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 28, 2021 , 02:15:52

ఫిబ్రవరిలోగా వైకుంఠధామాలను పూర్తి చేయాలి

ఫిబ్రవరిలోగా వైకుంఠధామాలను పూర్తి చేయాలి

  • వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్లగొండ, జనవరి 27 : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన వైకుంఠధామాల నిర్మాణాలను ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి ఆయా శాఖల అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణం, నర్సరీల నిర్వహణ, లేబర్‌ టర్నవుట్‌, పల్లె ప్రకృతి వనాల పనులపై మండలాల వారీగా సమీక్షించారు. వారంలోగా అన్ని నర్సరీల్లో సీడ్‌ సోయింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. పురోగతిలో ఉన్న పల్లె ప్రకృతి వనాలను సైతం వారంలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని ప్లాంటేషన్లకు ప్రతి నెలా ఐదో తేదీలోపు సర్వైవల్‌ కాప్చర్‌,  ప్రతి నెలా మూడో బుధవారం వాచ్‌ అండ్‌ వార్డు పేమెంట్లు పూర్తిచేయాలని సూచించారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo