సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Jan 28, 2021 , 01:59:37

ప్రతి తండాకు బీటీ రోడ్డు

ప్రతి తండాకు బీటీ రోడ్డు

  •  ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌  
  • పలు చోట్ల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

చందంపేట, జనవరి 27 : ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. నేరేడుగొమ్ము మండలం బుడ్డోనితండా నుంచి దాసర్లపల్లి గ్రామం వరకు రూ.3.27 కోట్లతో బీటీరోడ్డు, చందంపేట మండలం రేకులగడ్డ నుంచి యాపలపాయ తండాకు రూ.1.25 కోట్లతో సీసీ రోడ్డు పనులకు బుధవారం ఆయ న శంకుస్థాపన చేశారు. అనంతరం   మాట్లాడుతూ దాసర్లపల్లి గ్రామానికి 50 సంవత్సరాల నుంచి రోడ్డు సౌకర్యం లేదని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. మారుమూల తండాలకు సైతం రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకు ముందు గిరిజన మహిళలు ఆటాపాటలతో ఎమ్మెల్యేకు స్వాగ తం పలికారు.  కార్యక్రమంలో ఎంపీపీలు పద్మ, పార్వతి, జడ్పీటీసీలు పవిత్ర, బాలూనాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు నర్సింహారెడ్డి, బాలయ్య, పీఆర్‌ డీఈ లింగారెడ్డి, మాజీ ఎంపీపీలు ముత్యాల సర్వ య్య, తిరుపతయ్య, గోవింద్‌ యాదవ్‌, మల్లేశ్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచులు సుశీల, రజిత, బిక్కునాయక్‌, మున్నయ్య యాదవ్‌, శంకర్‌ నాయక్‌, ఖురేషి, హరిలాల్‌, బైరెడ్డి కొండల్‌రెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ  పాల్గొన్నారు.


VIDEOS

logo