అభివృద్ధి పథం కొనసాగిద్దాం

- వాడవాడలా ఎగిరిన మువ్వన్నెల జెండా
- ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవం
- పరేడ్ గ్రౌండ్స్‌లో జెండా ఎగురవేసిన నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు
- జిల్లాల అభివృద్ధి, సంక్షేమంపై నివేదన
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్ల ప్రదర్శన
72వ గణతంత్ర దినోత్సవాన్ని ప్రజలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు వాడవాడలా జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. రాజ్యాంగ ఫలాలు అందించిన మహాత్ములను స్మరించుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పరేడ్‌గ్రౌండ్‌లో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, సూర్యాపేటలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి జెండా ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించారు. ఉత్తమ ఉద్యోగులు, ఉత్తమ పంచాయతీలకు అవార్డులు అందజేశారు. అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి.
-నల్లగొండ ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/సూర్యాపేట, నమస్తే తెలంగాణ, జనవరి 26
అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి.. రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలతో ఎంతో మార్పు వచ్చింది. రైతు బంధు ద్వారా రూ.1200 కోట్లు, రైతుబీమాకు రూ.20.50 కోట్లు, మిషన్ భగీరథకు రూ.2,226కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.4,440 కోట్లు, కరోనాతో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు రూ.137.21 కోట్లు అందించాం.. చేనేత, వృత్తిదారులకు రుణాలు మంజూరు చేస్తున్నాం.. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిగా ఇదే ప్రగతిని కొనసాగిద్దాం.
- ప్రశాంత్ జీవన్‌పాటిల్, నల్లగొండ కలెక్టర్
నల్లగొండ ప్రతినిధి, జనవరి 26(నమస్తే తెలంగాణ) : జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. రైతులతోపాటు అన్నివర్గాలకు ప్రభుత్వ పథకాలతో ఎంతో ప్రయోజనం చేకూరుతున్నది. పట్టణ, పల్లె ప్రగతితో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. మరింత చిత్తశుద్ధితో అభివృద్ధి పథాన్ని కొనసాగిద్దామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకలకు జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి హాజరుకాగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయన్నారు. రైతుబంధు ద్వారా జిల్లాలో 4.40లక్షల మంది రైతులకు రూ.1200కోట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతుబీమా ద్వారా 410మంది రైతులు చనిపోతే వారి నామినీల ఖాతాల్లో రూ.20.50కోట్లు జమ చేశామన్నారు. రూ.223కోట్లతో 1356 చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.4440కోట్లు మంజూరు చేయగా రూ.3252కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు.
3.78లక్షల మందికి ఉపాధి..
జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ను 5వేల మందికి ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 1.95లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఈ ఏడాది మరో 2864 కొత్త కనెక్షన్లు ఇచ్చామని అన్నారు. రూ.223కోట్లతో 3.78లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. హరితహారంలో భాగంగా 73లక్షల మొక్కలను నాటినట్లు తెలిపారు. కరోనా సమయంలో 4.56లక్షల మందికి ఉచితంగా 8నెలలపాటు 9వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 6వేల మందికి రూ.73కోట్ల చెక్కులు పంపిణీ చేశామన్నారు.
జిల్లాలో రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభించి 183మందికి అందజేసినట్లు చెప్పారు. మత్స్య సంపద అభివృద్ధికి 553 చెరువుల్లో రూ.4.71కోట్ల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. 2313 మంది చేనేత కార్మికులకు రూ.9.76 కోట్లు, మరమగ్గాల కార్మికులకు 1.30 కోట్లు బదిలీ చేశామన్నారు. అనంతరం పల్లెప్రగతిలో భాగంగా ఉత్తమ గ్రామపంచాయతీల సర్పంచులకు అవార్డులు అందజేశారు. స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీ ఏవీ రంగనాథ్, అదనపు కలెక్టర్లు వనమాల చంద్రశేఖర్, రాహుల్‌శర్మ, ట్రైనీ కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా అధికారులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి
- కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలి
- విద్యుత్ వినియోగం..క్రమంగా అధికం!
- బీజేపీ ఇస్తామన్న ఉద్యోగాలు ఎక్కడ..?