ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 27, 2021 , 00:10:50

ఘనంగా జాతీయ పండుగ

ఘనంగా జాతీయ పండుగ

  • వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు

నీలగిరి, జనవరి 26 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాలను అధికారులు ఎగురవేశారు. స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌, జిల్లా పరిషత్‌ కార్యాలయంలో చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్‌, జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ రంగనాథ్‌, పోలీస్‌ కార్యాలయంలో ఏఎస్పీ నర్మద, పోలీసు శిక్షణ కేంద్రంలో డీటీసీ ఏఎస్పీ సతీశ్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కార్యాలయంలో ఏఆర్‌ డీఎస్పీ సురేశ్‌కుమార్‌, నల్లగొండ సబ్‌  డివిజన్‌ కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం సమర్పించారు. అన్నెపర్తిలోని 12వ బెటాలియన్‌లో కమాండెంట్‌ ఎన్వీ సాంబయ్య, జిల్లా జైలులో సబ్‌ జైళ్ల అధికారి టి.కళాసాగర్‌, జైలర్‌ దేవుల, డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు, నల్లగొండ మున్సిపాలిటీలో చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, చిట్యాలలో కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, నల్లగొండ డిపోలో మేనేజర్‌ సురేశ్‌కుమార్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యాసంస్థల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.

VIDEOS

logo