సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Jan 27, 2021 , 00:10:50

అంబేద్కర్‌ విగ్రహానికి నిత్య పూలమాల

అంబేద్కర్‌ విగ్రహానికి నిత్య పూలమాల

  • ట్రస్మా ఆధ్వర్యంలో శ్రీకారం
  • సంవత్సరంపాటు కొనసాగింపు

రామగిరి, జనవరి 26 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ట్రస్మా ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నివాళుల్పరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతను గౌరవించేలా జనవరి 26నుంచి సంవత్సరంపాటు అంబేద్కర్‌ విగ్రహానికి నిత్య పూలమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేజీ టూ పీజీ విద్యాసంస్థల చైర్మన్‌ గింజల రమణారెడ్డి, నాయకులు ముక్కాల నరసింహ, వేముల శేఖర్‌, అశోక్‌, భిక్షం పాల్గొన్నారు.

VIDEOS

logo