గురువారం 04 మార్చి 2021
Nalgonda - Jan 26, 2021 , 01:22:01

మాజీ సర్పంచ్‌ మృతికి పలువురి సంతాపం

మాజీ సర్పంచ్‌ మృతికి పలువురి సంతాపం

త్రిపురారం, జనవరి25 : మండలంలోని పెద్దదేవులపల్లి మాజీ సర్పంచ్‌ సింగం సైదులు ఆదివారం మృతి చెందారు. సోమవారం ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్‌ రాంచందర్‌నాయక్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నోముల భగత్‌, ఎంసీ. కోటిరెడ్డి తదితరులు సైదులు భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతాపం తెలిపిన వారిలో ఎంపీపీ గౌరవ సలహాదారుడు అనుముల శ్రీనివాసరెడ్డి, నాయకులు ధన్‌సింగ్‌నాయక్‌, నర్సిరెడ్డి, మర్ల చంద్రారెడ్డి, బహునూతల నరేందర్‌, వెంకటేశ్వర్లు, సర్పంచులు శ్రీనివాసరెడ్డి, బాల రమణీబాయి, ఎంపీటీసీ ఉన్నారు.

VIDEOS

logo