శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 25, 2021 , 01:39:57

ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు

ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు

  • జడ్పీ చైర్మన్‌ బండా, ఎమ్మెల్యే చిరుమర్తి
  • 83మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

నార్కట్‌పల్లి/ కట్టంగూర్‌(నకిరేకల్‌), జనవరి 24 : రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 83 మందికి కల్యాణలక్ష్మి ద్వారా మంజూరైన రూ. 83లక్షల 9వేల 628 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నార్కట్‌పల్లిలోని మదర్‌థెరిస్సా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్యర్యంలో జీవన జ్యోతి రైతు మార్కెట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా మండల ముఖ్యనాయకులతో సమావేశమై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పని చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ  రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, తాసీల్దార్‌ రాధ, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ యానాల అశోక్‌రెడ్డి, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, దోసపాటి విష్ణుమూర్తి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. నకిరేకల్‌ మండలం గొల్లగూడెంలో ఎమ్మెల్యే చిరుమర్తి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామానికి ట్రాక్టర్‌ ట్రాలీ, ట్యాంకర్‌ను పది రోజుల్లో అందిస్తానని తెలిపారు. 

VIDEOS

logo