బుధవారం 03 మార్చి 2021
Nalgonda - Jan 25, 2021 , 01:39:55

మృతుల కుటుంబాలకు ప్రముఖుల పరామర్శ

మృతుల కుటుంబాలకు ప్రముఖుల పరామర్శ

త్రిపురారం/ శాలిగౌరారం/కట్టంగూర్‌/ మునుగోడు, జనవరి 24 : త్రిపురారం మాజీ ఎంపీపీ పడిశల బుచ్చయ్య, మైనార్టీ నాయకుడు ఎస్‌కే జానీ ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబాలను ఆదివారం శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్‌ రాంచంద్రనాయక్‌ పరామర్శించారు. బుచ్చయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మండలంలోని సత్యనారాయణపురంలో ఇటీవల పార్‌బాయిల్డ్‌లో పడి గాయాల పాలైన సాయమ్మకు రూ.5 వేల సాయం అందజేశారు. వారి  మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నిడమనూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కామెర్ల జానయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. శాలిగౌరారం మండలంలోని తిర్మలరాయినిగూడెం టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు వడ్లకొండ భిక్షం మాతృమూర్తి సత్తమ్మకు ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చాడ కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. కట్టంగూర్‌ మండలం ఈదులూరు సర్పంచ్‌ ఐతగోని నారాయణ తండ్రి పుల్లయ్య అనారోగ్యంతో మృతిచెందడంతో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఆ గ్రామానికి వెళ్లి పుల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నకిరేకల్‌ పట్టణ టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు మాదగోని సైదులు తండ్రి భిక్షం చిత్రపటానికి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే వీరేశం నివాళులర్పించారు. మునుగోడు మండల కేంద్రానికి చెందిన గ్రంథాలయ మాజీ చైర్మన్‌ బండారు నర్సింహ మృతిచెందడంతో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి నివాళులర్పించారు. నర్సింహ సోదరుడు రఘును పరామర్శించి రూ.20 వేల సాయం అందించారు. 

VIDEOS

logo