నేతాజీ జీవితం స్ఫూర్తిదాయకం

- శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- నిత్య జాతీయ గీతాలాపనకు శ్రీకారం చుట్టిన జనగణమన ఉత్సవ సమితి
- హాజరైన ప్రధాన న్యాయమూర్తి రమేశ్, జడ్పీ చైర్మన్ బండా తదితరులు
రామగిరి, జనవరి 23 : నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నేతాజీ జయంతి-నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని శనివారం నల్లగొండలో ‘జనగణమన ఉత్సవ సమితి’ ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహం వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుత్తా తొలుత జ్యోతిప్రజ్వలన చేసి మైక్‌ల ద్వారా జాతీయ గీతం ప్రసారాన్ని ప్రారంభించారు. జాతీయ గీతం వినపడగానే పట్టణంలోని 12కేంద్రాల వద్ద ఎక్కడి వారు అక్కడే నిలబడి ఆలపించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని విధిగా గౌరవించాలని, అప్పుడే దేశభక్తిని చాటినవారమవుతామని పేర్కొన్నారు. ప్రముఖులతో కలిసి నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల్పరించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని విధిగా గౌరవించాలని కోరారు. డీఐజీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ దేశభక్తి, దేశ ఔన్నత్వాన్ని నేటి యువతకు తెలియజేయాలని సూచించారు. అనంతరం దేశ రక్షణలో భాగస్వామైన పలువురు మాజీ సైనికులను, నేతాజీ విగ్రహం ఏర్పాటుచేసిన లతీఫ్ కుమారుడు జానీని సన్మానించారు. నేతాజీ, భరతమాత వేషధారణల్లో చిన్నారులు అలరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్‌కుమార్, ప్రధానవక్త నర్రా శివకుమార్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి
ఉద్యోగులందరితో సమానంగా పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని పెన్షనర్స్ భవన్లో నూతనంగా నిర్మించిన ఏసీ కాన్ఫరెన్స్ హాల్‌ను ఆయన ప్రారంభించారు. పెన్షనర్స్ విశ్రాంతి భవనానికి స్థలాన్ని సేకరించుకుంటే నిర్మాణానికి సహకరిస్తామని వెల్లడించారు. పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ దామోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు కె.నాగమణిరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.వెంకట్‌రెడ్డి, జె.శ్రీశైలం పాల్గొన్నారు.
తాజావార్తలు
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..