సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Jan 24, 2021 , 00:37:43

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

  • కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

నీలగిరి, జనవరి 23: జనవరి 26న గణతంత్ర దిన వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. శనివారం ఆయన ఎస్పీ ఏవీ రంగనాథ్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, జిల్లా అధికారులతో కలిసి పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌ను సందర్శించి ఏర్పాట్లపై చర్చించారు. కొవిడ్‌-19 దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరేడ్‌గ్రౌండ్‌లో షామియానాలు, వేదిక, సీటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని ఆర్డీఓ, తాసీల్దార్‌ను ఆదేశించారు. పరేడ్‌గ్రౌండ్‌లో మూడుచోట్ల హ్యాండ్‌ శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలన్నారు. ఉత్తమ ఉద్యోగులకు, పల్లెప్రగతి అవార్డు గ్రహీతలకు మండలం వారీగా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిమిత సంఖ్యలో శాఖల వారీగా అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. వివిధ శాఖల ప్రగతికి సంబంధించి స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని, సంక్షేమ కార్యక్రమాలు, ఆస్తుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఈఓ భిక్షపతి, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌, హౌసింగ్‌ పీడీ రాజ్‌కుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ మోహన్‌రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తాసీల్దార్‌ నాగార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.

VIDEOS

logo