బుధవారం 03 మార్చి 2021
Nalgonda - Jan 24, 2021 , 00:32:06

ఫ్రెండ్లీ పోలీస్‌..

ఫ్రెండ్లీ పోలీస్‌..

నీలగిరి, జనవరి 23 : రోడ్డుపై నిలబడి ఆసరా కోసం ఎదురుచూస్తున్న ఓ వృద్ధుడిని గమనించి అతడు వెళ్లాల్సిన ప్రాంతానికి తన వాహనంలో తీసుకెళ్లి స్నేహభావం చాటుకున్నాడు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి.  రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ప్రముఖ అంబేద్కర్‌వాది, తన వాగ్దాటి, ఇంగ్లిష్‌ నైపుణ్యంతో ఎంతోమంది ఉన్నతాధికారులను సైతం విస్మయపరిచిన ఎం.ఎన్‌.భూషీ శనివారం రోడ్డుపై నిలబడ్డాడు. అటుగా వెళ్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆయనను గమనించి వాహనాన్ని నిలిపారు. అతని వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలో తెలుసుకున్నారు. తన వాహనంలో ఎక్కించుకొని పట్టణంలోని రామాలయం వద్ద గల అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

VIDEOS

logo