కొనసాగిన కరోనా వ్యాక్సినేషన్

- నల్లగొండలో టీకా వేయించుకున్న డీఎంహెచ్ఓ
నీలగిరి, జనవరి 22 : కరోనా వ్యాక్సిన్ను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, వైద్యారోగ్య సిబ్బందికి వేశారు. మొత్తంగా 11,036 మంది లబ్ధ్దిదారులను గుర్తించి మొదటి విడుతగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 10, 463 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా4,967 మందికి టీకా చేశారు. శుక్రవారం జిల్లాలో 39 మందికి వ్యాక్సిన్ చేశారు. శనివారం ఇమ్యూనైజేషన్ కారణంగా సెలవు తీసుకుని సోమవారం యథావిధిగా కార్యక్రమం కొనసా గించనున్నారు. శుక్రవారం సుమారు 2,493 మందికి వేయాలని టార్గెట్ కాగా ఇప్పటి వరకు 584 మందికి టీకాలు వేశారు. నల్లగొండ డివిజన్లో 18 కేంద్రాల్లో 859 మంది లబ్ధ్దిదారులకు 235 మందికి వేశారు. మిర్యాలగూడ డివిజన్లో10 కేంద్రాల్లో 908 మంది లబ్ధిదారులకు 220 మందికి వేశారు. దేవరకొండ డివిజన్లో 11 కేంద్రాల్లో 726 మంది లబ్ధిదారులకు 129 మందికి వేశారు. కాగా డీఎంహెచ్ఓ డా.కొండల్రావు కార్యాలయంలో టీకాను వేయించుకున్నారు.
తాజావార్తలు
- ఒకరి పాన్కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..