బుధవారం 24 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 23, 2021 , 01:34:26

యాసంగి ధాన్యం కొనుగోలుకు సిద్ధం కావాలి

యాసంగి ధాన్యం కొనుగోలుకు సిద్ధం కావాలి

  • మిర్యాలగూడ ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి 

మిర్యాలగూడరూరల్‌, జనవరి22 : యాసంగిలో  వరి ధాన్యాన్ని కొనుగో లు చేసేందుకు సిద్ధం కావాలని  మిర్యా లగూడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. అవంతీపురం     మార్కెట్‌ కమిటీ కార్యాలయం సమావేశ మందిరంలో రైస్‌ మిల్లర్లు, ట్రేడర్స్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వం తీసుకొన్న నిర్ణయం వల్ల ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. అందుకు ప్రత్యామ్నా       య గా మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం కొనుగోలు చేయాలని వ్యవసాయ మంత్రి ఆదేశించారన్నారు. రైతులు ధాన్యం అమ్ముకోవడంతో ఇబ్బందులు పడకూడదన్నారు. అందుకు మార్కెట్‌ కార్యవర్గం, సిబ్బంది, ట్రేడర్స్‌, రైస్‌ మిల్లు యజమానులు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ ఎల్‌.మేగ్యానాయక్‌, ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీధర్‌, మార్కెట్‌ డైరెక్టర్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo