దేశంలోనే ఆదర్శ సీఎం కేసీఆర్

- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కేతేపల్లి/కట్టంగూర్(నకిరేకల్), జనవరి 22 : పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శ సీఎంగా కేసీఆర్ నిలిచారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతేపల్లి మండల పరిధిలోని 51మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను మండల కేంద్రంలో శుక్రవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు. రైతుబంధు, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ లేవని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పెరుమాళ్ల శేఖర్, జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత, మార్కెట్ వైస్ చైర్మన్ కె.సైదిరెడ్డి, తాసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా చీకటిగూడెంలో రూ.12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ నర్మద, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నకిరేకల్ మండలంలోని అడవిబొల్లారం గ్రామంలో ఏసీడీఎఫ్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, పాలెం గ్రామంలో రూ.5 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కట్టంగూర్ జడ్పీటీసీ తరాల బలరాములు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సంద చెరువు సుందరీకరణ
- విశ్వ నగరానికిప్రాంతీయ బాట
- తడిచెత్తతో సేంద్రియ ఎరువు
- ఫలక్నుమా ఆర్ఓబీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు
- ఉద్యోగ అవకాశాలు కల్పించేది టీఆర్ఎస్సే..
- దోమల నివారణకు చర్యలు
- వేసవి దృష్ట్యా నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
- కార్యకర్తలే పార్టీకి పునాదులు
- స్వయం ఉపాధి.. మహిళలకు భరోసా
- ప్రథమస్థానంలో నిలుపాలి